Header Banner

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై కీలక అప్‌డేట్! బ్యాంకర్లతో సీఎం కీలక భేటీ!

  Tue Feb 04, 2025 12:39        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేంద్రం నిధులు ఇస్తున్నట్లు కనిపిస్తున్నా.. అవన్నీ పోలవరం, విశాఖ ఉక్కు పరిశ్రమ, అమరావతి.. అంటూ.. ప్రత్యేక అవసరాలకోసమే ఇస్తోంది. కానీ పథకాల అమలు, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నిధులు సరిగా లేవు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు.. చాలా సందర్భాల్లో చెబుతున్నారు. పాలనను ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నాం అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల్ని.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమలు చెయ్యలేకపోతున్నామని అంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ కీలక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ అమరావతిలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన.. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగబోతోంది. ఇది అత్యుత కీలకమైన సమావేశం. దీని ద్వారా సీఎం చంద్రబాబు.. బ్యాంకర్లకు కీలకమైన విజ్ఞుప్తులు చెయ్యబోతున్నారు. బ్యాంకర్లు సహకరిస్తేనే.. ఏపీ అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి. ఏ పథకం కొనసాగాలన్నా.. బ్యాంకర్ల సపోర్ట్ అవసరం. రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది.



ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!


అందుకే సీఎం చంద్రబాబు బ్యాంకర్లతో సమావేశం పెట్టుకుంటున్నారు. ఏపీలో రైతులకు రుణాలు ఇవ్వడం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను జాగ్రత్తగా నిర్వహించడం వంటి అంశాలకు బ్యాంకర్ల సహకారం కావాల్సి ఉంటుంది. లబ్దిదారుల అకౌంట్లలోకి త్వరగా మనీ చేరేందుకు బ్యాంకర్లు తగిన ఏర్పాట్లు చెయ్యాలి. అలాగే ఏవైనా సమస్యలు వస్తే, వెంటనే పరిష్కరించాలి. ఇవన్నీ జరగాలంటే.. సీఎంగా చంద్రబాబు ఓసారి వారికి చెప్పడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏపీలో కీలకమైన సూపర్ సిక్స్ గ్యారెంటీ పథకాలు అమలు కాకపోవడంపై.. ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆ హామీలను గమనిస్తే.. 1. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు / నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది ఇంకా అమలు కాలేదు. 2. స్కూల్ విద్యార్థులకు సంవత్సరానికి రూ.15,000 చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామన్నారు. అదీ ఇవ్వలేదు. ఈ పథకాన్ని మే, 2025 నుంచి అమలు చేస్తారని అంటున్నారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



3. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20వేలు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ఇంకా ఇవ్వలేదు. దీన్ని ఏప్రిల్‌లో ఇస్తామంటున్నారు. ఇంకా 4. ప్రతి మహిళకీ నెలకు రూ.1,500 (19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు) ఇస్తామన్నారు. అవీ ఇవ్వలేదు. 5. ప్రతి ఇంటికి సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇది అమలైంది. 6. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ఇంకా కల్పించలేదు. దీన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తారనే ప్రచారం ఉంది. ప్రభుత్వం మాత్రం అధికారికంగా చెప్పలేదు. ఇలా కీలక సూపర్ సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వం మొదటి ఆర్థిక సంవత్సరంలో ఫెయిలైందనే చెప్పుకోవాలి. ఇక రెండో ఆర్థిక సంవత్సరం (2025-26)లో నైనా అన్నీ అమలు చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. పథకాలు అమలు చెయ్యలేకపోవడానికి గత వైసీపీ చేసిన తప్పిదాలు, ఉంచిన భారీ అప్పులే కారణం అని ప్రభుత్వం అంటోంది. ఐతే.. కూటమి సర్కార్ వచ్చి 7 నెలలు అయిపోవడంతో.. ఇంకా వైసీపీని విమర్శించి లాభం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thallikivandhanam #annadhatha #sukheebhava #todaynews #flashnews #latestupdate