Header Banner

ఏపీ, తెలంగాణకు 7 రోజులు వర్ష సూచన.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు!

  Sat Apr 19, 2025 13:32        Environment

శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు గట్టిగానే కురిశాయి. హైదరాబాద్‌లో కూడా ఈదురు గాలులతో వాన పడింది. అందువల్ల ఇవాళ శనివారం వీకెండ్ ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. ఏపీ, తెలంగాణపై వర్షానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఇది ఒక రకమైన ద్రోణి. సాధారణ ద్రోణి కాదు. అంటే.. ప్రమాదకరమైన వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. దీని వల్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో 7 రోజులు వర్షాలు పడతాయి అని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందనీ, ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలి సుడులు వస్తాయని కూడా చెప్పింది. ఈ సుడులు వచ్చినప్పుడు రేకులు, ప్లాస్టిక్ వస్తువులు, ఆకులు ఇలా వాటికి ఎవి అడ్డువస్తే, అవి ఎగిరిపోతాయి. ప్రమాదం సృష్టిస్తాయి. మనం శాటిలైట్ లైవ్ అంచనాల్ని కూడా లెక్కలోకి తీసుకుందాం. ఎందుకంటే.. ఈ అంచనాలు చాలా వరకూ నిజం అవుతున్నాయి. ఈ అంచనాల ప్రకారం ఇవాళ రెండు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు పరుగులు పెడతూ ఉంటాయి. తెలంగాణలో ఇవాళ వాన పెద్దగా కురవదు. కానీ కురిసేలా మేఘాలు మాత్రం దట్టంగా ఉంటాయి. ఉత్తర తెలంగాణలో కొంత వాన పడే ఛాన్స్ ఉంది. సాయంత్రం వేళ కొత్తగూడెం, కేసముద్రం, వరంగల్, మంగపేట ఆ ప్రాంతాల్లో మోస్తరు వాన పడొచ్చు. హైదరాబాద్‌లో కూడా సాయంత్రం జల్లులు పడే ఛాన్స్ ఉంది. మనం ఏపీ సంగతి చూస్తే, ఇక్కడ కూడా మేఘాలు చాలా చోట్ల ఉంటాయి. సాయంత్రం వేళ తీర ప్రాంతాల్లో జల్లులు పడే ఛాన్స్ ఉంది. కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు వాన పడేలా ఉంది. రాత్రి 7 తర్వాత గుంటూరు, వినుకొండ, మార్కాపూర్, నంద్యాల ప్రాంతాల్లో మోస్తరు వాన పడొచ్చు.

 

ఇది కూడా చదవండి: ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

అలాగే.. దక్షిణ రాయలసీమలో సాయంత్రం 6 తర్వాత వాన మొదలై... రాత్రి 11 వరకూ మోస్తరుగా పడొచ్చు. తిరుపతి, ప్రొద్దుటూర్, కడప, కదిరి, పులివెందుల, మదనపల్లె, చిత్తూరు, హిందూపురం.. ఈ ప్రాంతాల్లో ఈ వాన పడేలా ఉంది. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 19 కిలోమీటర్లుగా ఉంటుంది. గాలి మొత్తం ఒడిశావైపు వెళ్తోంది. అక్కడేదో అలజడి తయారవుతోంది. మనకు ఏపీలో ఇవాళ గాలివేగం గంటకు 10 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 12 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణకు కర్ణాటక నుంచి గాలులు వేగంగా వస్తున్నాయి. వర్షం పడే సమయంలో ఈదురుగాలులు బాగా వస్తాయి. ఇవాళ ప్రయాణాలు చేసేవారికి గాలి చాలా ఆనందం కలిగిస్తుంది. వాన, గాలి ఉన్నా... ఎండ దారి ఎండదే. ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రత 35 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలు వాయవ్య తెలంగాణలో అంటే.. రామగుండం, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్.. అటువైపు ఉంటుంది. అక్కడి ప్రజలు.. ఎండల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏపీలో ఉష్ణోగ్రత 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాయలసీమలో ఎక్కువ వేడి ఉంటుంది. వానలు పడినా, వేడి అంతగా తగ్గదు అనుకోవచ్చు. తేమ పగటివేళ ఏపీలో 43 శాతం, తెలంగాణలో 32 శాతం ఉంటుంది. రాత్రి 12 తర్వాత ఏపీలో తేమ 90 శాతం ఉంటుంది. తెలంగాణలో 55 శాతం ఉంటుంది. తూర్పు తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో తేమ 70 శాతానికి చేరుతుంది. రాత్రివేళ ఏపీలో కొంత వాన పడే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తంగా ఇవాళ వాతావరణం బాగానే ఉంటుంది. ఎండ లేని ప్రాంతాల్లో వారికి ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ వర్షాలు పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ అతి వేగంతో వచ్చే గాలులు.. ప్రమాదాలకు కారణం కాగలవు.

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rains #Telangana #Summer #Temperatures #IMD