Header Banner

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

  Sat Feb 22, 2025 11:03        Politics

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధాన రహదారులపై ఫోకస్ పెట్టింది.. ఒక్కో ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేసుకుంటూ పనులు వేగవంతం చేస్తోంది. కేంద్రం సహకారంతో రోడ్ల పనులు ఊపందుకుంటున్నాయి. తాజాగా మరో నేషనల్ హైవే, ప్రధాన రహదారుల విస్తరణ పనులు వేగవంతం చేశారు. కొన్ని రోడ్లను నేషనల్‌ హైవే అథారిటీకి అప్పగించారు.. మరికొన్నిటిని మాత్రం ఏపీ రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు.. ఆ వివరాల ఇలా ఉన్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రోడ్లఫై ఫోకస్ పెట్టింది. గుంతలమయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టింది. కొత్త హైవేలతో పాటూ పాత హైవేలను కూడా విస్తరించే పనిలో ఉన్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్ల విస్తరణకు రంగం సిద్ధం చేశారు అధికారులు. పాడేరు నుంచి విశాఖపట్నం, అరకులోయ, చింతపల్లి మార్గాల వైపు రోడ్లను విస్తరించనున్నారు. చింతపల్లి వైపు మార్గం విస్తరణ పనులు నేషనల్‌ హైవే అథారిటీకి అప్పగించగా.. అరకులోయ, విశాఖపట్నం వైపు మార్గాలను రోడ్ల, భవనాల శాఖకు అప్పగించారు.

 

2016లోనే పాడేరులో ప్రధాన రహదారుల విస్తరణ రోడ్ల, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని ప్రతిపాదించారు.. ఆ తర్వాతి ఏడాది రూ.47 కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి.. 2023లో జగన్ సర్కార్ రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు చేసినా అడుగులు ముందుకుపడలేదు. తాజాగా జిల్లా కలెక్టర్ ప్రధాన రహదారి విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. కానీ జాతీయ రహదారి 516ఈ రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు పనులు జరుగుతుండడంతో పాడేరు నుంచి చింతపల్లి వైపు ఉన్న మెయిన్‌రోడ్డు విస్తరణ పనులను నేషనల్‌ హైవే అథారిటికే అప్పగించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 


ఈ రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాల ఎంపిక, ఆక్రమణల గుర్తించి, నష్టపోతున్న వారికి పరిహారాన్ని వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేశారు. మరో నెల రోజుల్లో పాడేరు అంబేద్కర్ సెంటర్‌ నుంచి చింతపల్లి వైపు ప్రధాన రహదారి విస్తరణ పనులు ప్రారంభించనున్నారు. ఇటు పాడేరు నుంచి అరకులోయ వైపు, విశాఖపట్నం వైపు ఉన్న రోడ్డు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రతిపాదనలను ఆమోదించి.. రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు కూడా అనుమతి వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

పాడేరు ప్రధాన రోడ్ల విస్తరణలో భాగంగా అరకులోయ వెళ్లే మార్గం, విశాఖపట్నం వెళ్లే రోడ్డు, చింతపల్లి వెళ్లే రోడ్లు ఉండగా.. పాడేరు నుంచి ఆయా మార్గాల్లోని మెయిన్‌ రోడ్డును రెండు కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోడ్లను విస్తరిస్తే పాడేరు మెయిన్‌రోడ్డు విస్తరణతోనే ట్రాఫిక్ సమస్యకు చెక్‌ పెట్టొచ్చంటున్నారు అధికారులు. మొత్తం మీద రోడ్ల విస్తరణ పనుల్ని మరింత వేగవంతం చేయనున్నారు. ఓవైపు జాతీయ రహదారి విస్తరణ పనులు.. మరోవైపు ప్రధాన రహదారుల్ని విస్తరించడంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ రోడ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ రోడ్లు పూర్తయితే పాడేరు ప్రాంతానికి వచ్చే సందర్శకులకు కూడా సౌకర్యంగా ఉంటుందంటున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #aphighways #aproads