Header Banner

ఆంధ్రప్రదేశ్​లో క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. అల ఆకాశంలో.. జాలీ జాలీగా ప్రయాణం.!

  Sat Mar 22, 2025 13:05        Politics

లేటెస్ట్ టెక్నాలజీతో ఎయిర్‌ ట్యాక్సీలను పట్టణాలు, నగరాలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా వంటి దేశాలు మాత్రమే ఈ రేసులో ముందు ఉన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఆయా దేశాలతో పోటీ పడుతూ ఎయిర్‌ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ‘మ్యాగ్నమ్‌ వింగ్స్‌’ కంపెనీని ఏర్పాటు చేసి ప్రయోగాలు చేస్తున్నారు. మోటర్లు మినహా మిగతా పరికరాలన్నీ మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌ కావడం ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ. గుంటూరుకు చెందిన చావా అభిరాం అనే వ్యక్తి అమెరికాలో రోబోటిక్స్‌ ఇంజినీరింగ్, మాస్టర్స్‌ పూర్తి చేశారు. మన దేశంలోనే ఏదైనా కంపెనీ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడకు వచ్చేశారు. ట్రాఫిక్‌తో సతమతమవుతున్న నగరాల్లో ఎయిర్‌ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని భావించి దానిపై రీసెర్చ్ చేశారు. వివిధ దేశాల్లో ఎయిర్‌ ట్యాక్సీల రంగంలో జరుగుతున్న పరిశోధనలను పరిశీలించారు. అనంతరం 2019లో గుంటూరు శివారులోని నల్లచెరువులో ‘మ్యాగ్నమ్‌ వింగ్స్‌’ కంపెనీని ఏర్పాటు చేసి చిన్న సైజులో ఉండే ఎయిర్‌ ట్యాక్సీని తయారుచేశారు. పైలట్‌ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించి, దాన్ని విజయవంతంగా ప్రయోగించారు. పైలట్‌ లేని ఈ వాహనాలను డీజీసీఏ అనుమతించదు కాబట్టి, పైలట్‌ కూడా ఉండేలా రెండు లేదా మూడు సీట్లతో ఎయిర్‌ ట్యాక్సీలను తయారు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్! హాల్ టికెట్లు నిలిపితే కఠిన చర్యలు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోట్లు విడుదల!

 

పూర్తిగా దేశీయ ఉపకరణాలతోనే ప్రాజెక్టుని రూపొందిస్తున్నారు. రెండు సీట్లతో ఒక ఎయిర్‌ ట్యాక్సీని రూపొందించి వీ2 అని పేరు పెట్టారు. దీని ప్రయోగం విజయవంతం అవడంతో రెండో వెర్షన్‌ తయారీలో నిమగ్నమయ్యారు. మూడు సీట్లతో కూడిన ఎక్స్‌4 అనే మోడల్‌ను మరో నెల రోజుల్లో పరిశీలించనున్నారు. వీ2 రకం గరిష్ఠంగా 40 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. 1000 అడుగుల ఎత్తులో ప్రయాణించే దీని గరిష్ఠ వేగం 100 కిలో మీటర్లు. ఎక్స్‌4 ఎయిర్‌ ట్యాక్సీ 300 కిలో మీటర్ల దూరాన్ని 20 వేల అడుగుల ఎత్తులో 300 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దూర ప్రయాణాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మార్కెట్‌లోకి వచ్చేటప్పటికి వీ2 మోడల్‌ ధర 2 కోట్ల రూపాయలు, ఎక్స్‌-4 రకం 8 కోట్ల రూపాయలు ఉండొచ్చని అభిరామ్‌ పేర్కొన్నారు. క్యాబ్‌ ఖర్చుతోనే ఎయిర్‌ ట్యాక్సీలో ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలనేది తన లక్ష్యమని ఆయన తెలిపారు. తమ వాహనాలు బ్యాటరీ సహాయంతోనే నడుస్తాయని, ఆకాశమార్గంలో దూరం తక్కువగా ఉండటం వల్ల నిర్వహణ ఖర్చు సైతం పెద్దగా ఉండదని అభిరామ్ వివరించారు. మనదేశంలో బెంగళూరు, చెన్నై తదితర సిటీలలో సైతం ఎయిర్‌ట్యాక్సీలపై ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎయిర్‌ ట్యాక్సీ పాలసీ ఇంకా డ్రాఫ్టింగ్‌ దశలోనే ఉంది. విధి విధానాలు అందుబాటులోకి వస్తే అనుమతుల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అనంతరం వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పడుతుందని అభిరామ్‌ తెలిపారు. మ్యాగ్నమ్‌ వింగ్స్‌ సంస్థ ద్వారా ఎయిర్‌ ట్యాక్సీ సేవలను తీసుకురావడమే కాకుండా కావాలనుకున్నవారికి వాటిని విక్రయిస్తామని పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన.. కచ్చితంగా అలా చేయాల్సిందే.!

 

చరిత్రలో తొలిసారి... అప్పుడు మూడు నెలల పాటు తిరుమల ఆలయాన్ని మూసివేయాలనుకున్న అధికారులు! ఏం జరిగింది? మరి ఇప్పుడు...

 

ఏపీలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఓకే చెప్పిన జైషా.. అక్కడే ఫిక్స్.!

 

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త వాతావరణం.. కార‌ణ‌మిదే!

 

దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి! ఆసిఫ్ మృతికి గ‌ల కార‌ణాలు.!

 

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం! త‌రిగొండ వెంగ‌మాంబ స‌త్రంలో..

 

రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!

 

చీప్‌.. వెరీ చీప్‌.. రూ. 599కే ఎయిర్‌ ఇండియా టికెట్‌.! ఈ బంపర్ ఆఫర్ మిస్సవ్వకండి.!

 

USA: F-1 విద్యార్థి వీసా నుండి H-1B వర్క్ వీసాకు మారుతున్నారా? కఠినతరం చేసే ఇమ్మిగ్రేషన్ విధానాలు! మరిన్ని వివరాలు మీ కోసం!

 

జగన్ పరిస్థితి అయోమయం.. సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే.. ఆదేశాలు జారీ చేసిన కోర్టు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #MagnumWings #AerospaceCompany #AirTaxi