Header Banner

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

  Wed Apr 23, 2025 08:37        Politics

సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును షాతో పంచుకున్నట్లు తెలిసింది. వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరగనున్న ఎన్నికపైనా చర్చించినట్లు సమాచారం. ఈ స్థానాన్ని భాజపాకు వదిలిపెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా, ఆ విషయాన్ని తెదేపా నాయకులు ధ్రువీకరించలేదు.
అయితే, చంద్రబాబు కంటే ముందు అమిత్ షాను కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగలు కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు కృష్ణమాదిగ ఆ తర్వాత విలేకర్లకు చెప్పారు. అనంతరం ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికార నివాసం జన్పథ్కు వచ్చి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికకు భాజపా నాయకత్వం తమిళనాడు భాజపా మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లను ప్రతిపాదిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అటు తెదేపా, ఇటు భాజపా నాయకులు ధ్రువీకరించలేదు.

ఇది కూడా చదవండి: ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య.. కత్తులతో దాడి చేసిన దుండగులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


నాలుగు గోడల వెనుక కాదు… జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!


స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..


సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!


వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!


చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?


మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..


చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!


ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!


ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #MandaKrishnaMadiga #RajyaSabha #ChandrababuNaidu #AmitShah #BJP #TDP #APPolitics