Header Banner

USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!

  Thu Feb 06, 2025 14:48        U S A

USA: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. మొత్తంగా 104 మంది ఆ విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. దీంతో అమెరికా కలలు కంటూ.. తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకొని అక్కడికి వెళ్లిన వారి ఆశలు అడియాశలయ్యాయి. ఈక్రమంలో వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మబలికిన ఏజెంట్కు రూ.42 లక్షలు ఇచ్చి హర్వీందర్ సింగ్ దారుణంగా మోసపోయాడు. ఆయనది పంజాబ్లోని హోషియాపుర్కు చెందిన తహ్లి గ్రామం. తర్వాత వీసా రాలేదని చెప్పడంతో దిల్లీ నుంచి ఖతర్.. అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్లి నానాయాతన పడుతూ అమెరికా వెళ్లాడు. ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ ఉన్న డబ్బు పోయి, ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వచ్చి నిల్చున్నారు. సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. "ఎలాగోలా బ్రెజిల్ చేరితే తర్వాత పెరూలో విమానం ఎక్కిస్తానని చెప్పారు. కానీ అలాంటి ఏర్పాటు ఏదీ చేయలేదు. తర్వాత ట్యాక్సీల్లో కొలంబియా, పనామా తీసుకెళ్లారు. అక్కడి నుంచి నౌక ఎక్కిస్తామన్నారు. అదీ లేదు. రెండురోజుల పాటు అక్రమమార్గంలో ప్రయాణించాం. తర్వాత పర్వతమార్గంలో ముందుకెళ్లాం. 

 

ఇది కూడా చదవండి: హెచ్ 1బీ వీసాదారులకు ట్రంప్ మరో బిగ్ షాక్! ఇక ఆ విధానం రద్దు!

 

మెక్సికో సరిహద్దుకు వెళ్లడం కోసం మమ్మల్నందరినీ ఒక చిన్న బోటులో కుక్కేశారు. అందులో నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత బోటు తిరగబడింది. దానివల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పనామా అడవిలో మరొకరు చనిపోయారు" అని వాపోయారు. దారాపుర్ గ్రామానికి చెందిన సుఖ్పాల్ సింగ్ కూడా ఇలాంటి దుస్థితినే ఎదుర్కొన్నారు. 15 గంటల పాటు సముద్ర ప్రయాణం చేసి, దాదాపు 45 కి.మీ. పర్వతమార్గంలో ముందుకెళ్లారు. "ఎవరైనా గాయపడితే.. వారి పరిస్థితి అంతే. మిగిలేది మరణమే. దారివెంట ఎన్నో మృతదేహాలను చూశాం. ఇక కొద్దిసేపట్లో మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలో అడుగుపెడతామనగా జలంధర్కు చెందిన ఓ వ్యక్తి అరెస్టు కావడంతో మా ప్రయణం అంతా వృథా అయింది. దాంతో మమ్మల్ని 14 రోజులపాటు చీకటి గదుల్లో బంధించారు. సూర్యుడు జాడే లేకుండా పోయింది. అక్కడ వేలాది మంది పంజాబీ కుటుంబాలకు చెందిన యువకులు, పిల్లలు కనిపించారు. అందరిదీ ఒక్కటే దుస్థితి. ఇలా అక్రమమార్గంలో విదేశాలకు వెళ్లొద్దని కోరుతున్నా” అని సుఖ్వల్ ఆవేదన వ్యక్తంచేశారు. భారత్ కు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా నుంచి బయలుదేరిన సైనిక విమానం బుధవారం అమృత్సర్కు చేరుకున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 1.55 గంటలకు శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీ-17 గ్లోబ్మాస్టర్ విమానం దిగింది. ఇందులో అమెరికా వెనక్కి పంపిన వారిలో 33 మంది చొప్పున హరియాణా, గుజరాత్ల నుంచి, 30 మంది పంజాబ్ నుంచి, ముగ్గురేసి చొప్పున మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ నుంచి, ఇద్దరు చండీగఢ్ నుంచి ఉన్నారు. అమృత్సర్కు తీసుకొచ్చిన వారిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. అమృత్సర్కు చేరుకున్న అక్రమ వలసదారులను పోలీసులు తనిఖీ చేసి, వారి వివరాలను పరిశీలించాక ఇళ్లకు పంపారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ.. వ్యాఖ్య‌లు వైర‌ల్‌!

 

జగన్ దొంగ రాజకీయం.. ఆ డబ్బును లెక్కపెట్టడానికి.. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది!

 

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు! ఎక్కడో తెలుసా?

 

జగన్ 2.0 కాదు, పాయింట్ 5 మాత్రమే! మాజీ మంత్రి తీవ్ర విమర్శలు! ఇలాంటి పరిస్థితుల్లో..

 

ఈ ప్రాంత వాసులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్! కొత్త రైల్వే జోన్‌కు ఉత్తర్వులు జారీ.. ప్రధాన రైల్వే డివిజన్లు ఇవే..

 

నేడు (6/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేశ్ భేటీ! ఈ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #indian's #deported #ViralNews