Header Banner

హిందూ ఆలయాలపై పదేపదే దాడులు.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.! అప్పటి ప్రభుత్వం ఈ ఘటనలపై..

  Tue Mar 11, 2025 15:19        Politics

మార్చి 11: 2019 నుండి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను తగలబెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై జరిగిన విచారణ, నమోదైన కేసులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  శాసన మండలిలో సభ్యుల ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంత్రి అనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ : "గత ప్రభుత్వం హయాంలో దేవాలయాలపై దాడులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వందల సంఖ్యలో ఘటనలు నమోదయ్యాయి. ఇందులో చాలా వరకు నిర్లక్ష్య వైఖరితో సరిపెట్టారు. అప్పటి ప్రభుత్వం ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిపోయి, మౌనంగా ఉండడం గమనార్హం. హిందూ భక్తుల మనోభావాలను గౌరవించకుండా ఆ ఘటనలను నిర్లక్ష్యంగా పరిగణించారు" అని మంత్రి మండిపడ్డారు. మన ధర్మం మనకు రక్షణగా నిలవాలంటే ప్రభుత్వ పాలకులు భక్తులు మనోభావాలను గౌరవించాలి దేవాలయాల ప్రతిష్టను కాపాడాలి కానీ గత  వైసిపి హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులను నిర్లక్ష్యం చేయడమే కాదు దోషులను కాపాడేందుకు చిత్తశుద్ధి లేని విచారణలు జరిపింది అని మంత్రి ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

2019-2024 మధ్య కాలం లో "అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథం దహనం, బిట్రగుంట రథం కాలిపోవడం ఆంజనేయస్వామి తోక, విరగొట్టడం, ఇలా ఒకటే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అలాగే చాలా దేవాలయంలో భద్రత సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం ఇవన్నీ హిందూ సమాజాన్ని కలవరపరిచాయి అని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ దేవాలయాల విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తుంది ఏదయినా చిన్న చిన్న ఘటనలు జరిగితే తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటుంది గతంలో జరిగినటువంటి ఘటనలను పునరావృతం కాకుండా అందు కొరకు ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు  చేసి గతంలో నిర్లక్ష్యం చేసిన కేసులపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాము.అలాగే  ప్రముఖ దేవాలయాల్లో CCTV సర్వైలెన్స్, భద్రతా సిబ్బంది నియామకం కూడా జరుపుతున్నట్లు మంత్రి ప్రకటించారు.భవిష్యత్ లో దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిపై  తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని మంత్రి పేర్కొన్నారు. "కూటమి  ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే దేవాలయాల సంస్కృతిని సాంప్రదాయాలను తిరిగి స్థాపించినందుకు, భక్తులకు మరింత సౌకర్యాలు అందించేందుకు, భక్తి పరిపూర్ణమైన పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అని  మంత్రి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ మా ప్రభుత్వ ధ్యేయం. గుడులపై దాడి అంటే భక్తుల మనోభావాలపై దాడి, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం" అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  మరోసారి స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KinjarapuRamMohanNaidu #Guntur #Pressmeet #AndhraPradesh