Header Banner

ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మంత్రి దుర్గేష్ అడుగులు! బెర్లిన్ వేదికగా కీలక ఒప్పందాలు....

  Tue Mar 04, 2025 10:00        Politics

జర్మనీ చేరుకున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు ఎయిర్‌పోర్ట్‌లో కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నేటి నుండి బెర్లిన్ ఎక్స్‌పో సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో మంత్రి దుర్గేష్ పాల్గొననున్నారు. రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయన ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: పోసానిపై కేసుల మోత..! ఏపీలో మరో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు!

 

 

ఈ సదస్సులో ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఆయన బెర్లిన్ వేదికపై వివరించనున్నారు. ముఖ్యంగా పర్యాటక, అతిథ్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎకో టూరిజంలో పెట్టుబడులు, వివిధ రకాల పర్యాటక అవకాశాలపై ప్రస్తావించనున్నారు. దాదాపు 30 మందికి పైగా పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా భేటీ అవుతూ, వరల్డ్ మీడియాతో ఏపీ పర్యాటక అవకాశాలను చర్చించనున్నారు.

మంత్రి దుర్గేష్‌తో పాటు ఈ పర్యటనలో ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట కూడా పాల్గొంటున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం!  రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!



పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!


బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?


రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..


చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..


ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!

రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #APTourism #GlobalTourism #InvestInAP #BerlinExpo2025 #ITBBerlin #APTourismGrowth #MinisterDurgesh #EcoTourism #TourismOpportunities