Header Banner

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్! మండలిలో మాటల యుద్ధం! దమ్ముంటే ఈ డేటాను ఇవ్వండి..

  Wed Mar 19, 2025 12:49        Politics

అమరావతిః వైసీపీ హయాంలో వైసీపీ హయాంలో ఎంతమంది విద్యార్థులు ఏ స్కూల్ లో చదువుతున్నారో డేటా లేదని, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స.. డేటా ఎందుకు లేదో సమాధానం చెప్పాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే అంశంపై మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. విద్యారంగంపై సభలో చర్చ జరిగినప్పుడు వైసీపీ సభ్యులు పారిపోయారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. హౌస్ అజెండా బీఏసీ నిర్ణయిస్తుంది. విద్యలో సంస్కరణలపై చర్చ జరగాలని వైసీపీనే కోరింది. మేం సన్నద్ధమై సభకు వచ్చాం. హౌస్ ఛైర్మన్ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీ చెప్పినట్లు నడవదు. తమకు కావాల్సినప్పుడు చర్చ పెట్టాలని, ఈ రోజు మూడ్ బాగాలేదు, మేం బయటకు వెళ్లాలని, వేరే పనులు ఉన్నాయని, పార్టీ మీటింగ్ లు ఉన్నాయని వాయిదా వేయాలనుకుంటే అందుకు ప్రభుత్వం, ఛైర్మన్ సిద్ధంగా లేరని మండిపడ్డారు. బొత్స సీనియర్ నాయకులని, మంత్రిగా పనిచేశారని, ఆలోచించి మాట్లాడాలని అన్నారు. విద్యారంగంపై సభలో విపులంగా చర్చించడం జరిగింది. నోట్ కూడా ఇచ్చాం. అది చదవాలని వైసీపీ సభ్యులకు సూచించారు.

 

ఇది కూడా చదవండి: ఇండియాలో 5 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఏదో తెలుసా.? అసలు ఊహించి ఉండరు!

 

12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరం కావడంపై చర్చకు సిద్ధం..

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ విద్యలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు పాఠశాల విద్యలో ఎంతమంది విద్యార్థులు చదివారో లెక్కలు చెప్పాలని సవాల్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధం. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్లారు, ఏ ప్రైవేటు పాఠశాలలో సంఖ్య పెరిగిందో మేం చెబుతాం. వైసీపీ హయాంలో డ్రాప్ బాక్స్ విధానం తీసుకువచ్చారు. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచేందుకు విద్యార్థులను డ్రాప్ బాక్స్ లో పెట్టారు. 17 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న విద్యార్థులు లక్ష మంది పాఠశాల విద్యలో ఉన్నారు. ఆ వివరాలన్నీ ఇవ్వగలం. టోఫెల్ గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ అచీవ్ మెంట్ సర్వే చూస్తే.. 2017లో ఇంగ్లీష్ లో భారతదేశంలో నాలుగో స్థానంలో ఉన్నాం. వైసీపీ హయాంలో 14 స్థానానికి ఎందుకు పడిపోయామో సమాధానం చెప్పాలి. పదో తరగతి సోషల్ సైన్స్ లో 6వ స్థానం నుంచి 24వ స్థానానికి ఎలా పడిపోయామో చెప్పాలి. సైన్స్ విషయానికి వస్తే మొదటిస్థానం నుంచి 15వ స్థానానికి పడిపోయాం. గణితంలో మొదటిస్థానం నుంచి 12వ స్థానానికి ఎలా పడిపోయామో చెప్పాలి.

 

ఇది కూడా చదవండి: బెట్టింగ్ యాప్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లు! అరెస్టు భయంతో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్న సెలబ్రిటీలు !

 

ఏ పాఠశాలలో ఐబీ సిలబస్ అమలుచేశారో సమాధానం చెప్పాలి..

ఐబీ విషయానికి వస్తే కేవలం ఒక కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం రూ.4.86 కోట్లు ఖర్చు పెట్టారు. ఐబీ కరిక్యులమ్ అమలు చేశామని ఎలా చెబుతారు? ఏ పాఠశాలలో అమలు చేశారు ఐబీ? సమాధానం చెప్పాలి. సీబీఎస్ఈ విషయంలో విద్యార్థులను సన్నద్ధం చేయలేదు. మాక్ టెస్ట్ నిర్వహిస్తే కనీసం ఒక సబ్జెక్ట్ లో 90శాతం మంది ఫెయిల్ అయ్యారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా, పిల్లలను సన్నద్ధం చేయకుండా సీబీఎస్ఈ తీసుకువచ్చారు. ఇప్పుడు పరీక్షలకు అనుమతిస్తే.. వారు ఫెయిల్ అయితే సోషల్ ఇష్యూస్ వస్తాయి. చిన్న వయసులోనే పెళ్లిచేస్తారు. సీబీఎస్ఈ విధానాన్ని మేం ఉపసంహరించలేదు, వాయిదా వేశాం. టోఫెల్ కు రూ.60 కోట్లు ఖర్చుపెట్టారు. ఎందుకు ఇంగ్లీష్ పడిపోయిందో సమాధానం చెప్పాలి. ఆ రోజు నేను సుదీర్ఘంగా చర్చించాం. అప్పుడు చర్చలో పాల్గొనకుండా ఈ రోజు వచ్చి మాట్లాడటం సరికాదు. హౌస్ రూల్స్ బొత్స గారికి తెలుసు. ఏ అంశంపైనైనా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం.

 

ఇది కూడా చదవండి: అనకాపల్లిలో ట్రాన్స్‌జెండర్ హత్య! కఠిన చర్యలకు సీఎం ఆదేశం!

 

వైసీపీ హయాంలో ఎంతమంది విద్యార్థులు ఏ స్కూల్ లో చదువుతున్నారో డేటా లేదు..

కనీసం ఎంతమంది పిల్లలు, ఏ స్కూల్ లో చదువుతున్నారో డేటా లేకుండా వైసీపీ చేసింది. రెండేళ్లు మంత్రిగా పనిచేసిన బొత్స.. డేటా ఎందుకు లేదో సమాధానం చెప్పాలి. ఏ టీచర్ ఏ స్కూల్ లో పాఠాలు చెబుతున్నారో డేటా లేదు. సమాధానం చెప్పాలి. ఏ డేటా లేక బేసిక్ డ్యాష్ బోర్డ్ తయారు చేయలేకపోతున్నాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిప్పుడు 6నెలల్లో డ్యాష్ బోర్డు రూపొందించాం. గ్రిప్ వచ్చింది. విద్యారంగంలో ఇప్పుడిప్పుడే డ్యాష్ బోర్డ్ తయారవుతోంది.

 

వైసీపీ మాదిరిగా విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు పంపడం లేదు..

నూటికి నూరు శాతం ఉపాధ్యాయులు పాఠాలే చెప్పాలనే విధానానికి కట్టుబడి ఉన్నాం. యాప్ ల భారం తగ్గిస్తున్నాం. సింగిల్ యాప్ తీసుకువస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. పిల్లలను రాజకీయ కార్యక్రమాలకు పంపడం లేదు. గత వైసీపీ పాలనలో మాదిరిగా సీఎం కార్యక్రమానికి పిల్లలను తీసుకెళ్లి దారిపొడవునా నిల్చోబెట్టడం లేదు. పిల్లలు స్కూల్ లో ఉండాలి. వారు ప్రయోజకులుగా మారాలనేదే మా లక్ష్యం. మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. పాజిటివ్ వాతావరణం తీసుకువస్తున్నాం. ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు కాబట్టే విద్యారంగంలో సంస్కరణలు తీసుకురాగలుగుతున్నాం.

 

ఇది కూడా చదవండి: ఏపీలో భానుడి ప్రతాపం ! తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! ఆస్పత్రుల్లో డీహైడ్రేషన్ కేసులు...

 

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల పెంపును ఛాలెంజ్ గా తీసుకున్నాం..

సింగిల్ టీచర్స్ స్కూల్స్ విషయానికి వస్తే 12,512 పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్నారు. ఇది వాస్తవం. 30శాతం పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్నారు. అందుకే మోడల్ ప్రైమరీ స్కూళ్ల కింద కనీసం 7,8 వేల ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడిని అందించే అవకాశం ఏర్పడుతుంది. అందరం కలిసికట్టుగా చేస్తున్నాం. దీనివల్ల లెర్నింగ్ అవుట్ కమ్స్ మెరుగుపడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో సీటుకు రికమెండ్ చేయాలని ఎప్పుడైతే ప్రజాప్రతినిధులను తల్లిదండ్రులు అడుగుతారో అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెరిగాయనే నమ్మకం ఏర్పడుతుంది. దీనిని ఛాలెంజ్ గా తీసుకున్నామని, ఇందుకు రెండేళ్ల సమయం ఇవ్వాలని, కచ్చితంగా చేసి చూపిస్తామని మంత్రి చెప్పారు. అంతముందు బొత్స వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ.. సభలో ఎప్పుడు ఏ చర్చ జరగాలనేది ఛైర్మన్ నిర్ణయిస్తారని, విద్యారంగంపై జరిగిన చర్చలో పాల్గొనకుండా ప్రశ్నోత్తరాల సమయంలో విద్యారంగంపై చర్చకు పట్టుబట్టడం, తాము చెప్పిందే జరగాలనే ఆలోచన సరికాదని, ఛైర్మన్ నిర్ణయాన్ని తప్పుబట్టేవిధంగా వ్యవహరించిన బొత్స క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ! 60 వేల దరఖాస్తుల పరిశీలన! కొనసాగుతున్న కసరత్తు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కి షాక్‌ల మీద షాక్‌లు.. వైసీపీలో గందరగోళం.. మరో కీలక నేత రాజీనామా!

 

అయ్యయ్యో.. ఏపీ ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు... గాయపడిన ఎమ్మెల్యే.!

 

వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ! రేపు కూటమిలో చేరబోతున్న వైసీపీ కార్పొరేటర్లు ....

 

పోసాని పొలిటికల్ స్క్రిప్ట్! డైలాగ్ రైటర్ నుండి రిమాండ్ రైటర్ వరకు...

 

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..! ఇక వారికి పండగే పండగ!

 

కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు చాంబర్‌లో పవన్ కల్యాణ్ తో ప్రత్యేక భేటీ! పలు కీలక నిర్ణయాలకు ఆమోదం!

 

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెయిన్స్ షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచి అంటే..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting