Header Banner

కేంద్రమంత్రి తో మంత్రి నారా లోకేశ్‌ భేటీ! ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు..

  Wed Feb 05, 2025 13:36        Politics

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయ‌న‌కు వివరించారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలన్నారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారుచేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నామని తెలిపారు.

 

ఇంకా చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన! నాలుగు గంట‌ల‌కు పైగా విమానాశ్ర‌యంలో..

 

కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్ నాథ్ కు తెలియ‌జేశారు. ఇక గత పాలకుల అనాలోచిత విధానాలతో రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందంటూ ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి లోకేశ్ చెప్పారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు పాల్గొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్! ఇది నిరూపిస్తే 10 కోట్ల రూపాయలు మీ సొంతం! ఛాలెంజ్ విసిరిన మంత్రి లోకేష్!

 

భవిష్యత్‌లోనూ ఇదే పంథా కొనసాగిద్దాం! త్వరలో కేంద్ర మంత్రి వైష్ణవ్ రాష్ట్రంలో.. కూటమి ఎంపీలతో మంత్రి!

 

ఉచిత గ్యాస్ సిలిండర్‌పై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! ఆ డేట్‌లోగా బుక్ తప్పనిసరి?

 

జియో వినియోగదారులకు గుడ్ న్యూస్! తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా! సరికొత్త ప్లాన్!

 

ఏపీలో రూ.96 వేల కోట్లతో భారీ పరిశ్రమ! కేంద్రం కీలక ప్రకటన!

 

ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీల ఛైర్మన్లు నియామకం! కీలక నోటిఫికేషన్ జారీ!

 

ఓరీ దేవుడా.. ఒకే అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో.. రోడ్డుపై విద్యార్థినుల ఫైట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #RajnathSingh #NewDelhi #AndhraPradesh #NewProjest #APpolitics