Header Banner

మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్‌ క‌ల‌క‌లం! ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి?

  Wed Feb 12, 2025 12:06        Politics

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌టన‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం నాడు నాలుగు రోజుల విదేశీ ప‌ర్య‌ట‌నకు ఆయ‌న‌ బయలుదేరి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని ప్ర‌యాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. మోదీ ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి జరగవచ్చని త‌మ‌కు స‌మాచారం వ‌చ్చిన‌ట్లు ముంబ‌యి పోలీసులు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 11న ముంబ‌యి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మోదీ విమానంపై ఉగ్ర‌దాడి జ‌ర‌గొచ్చ‌ని ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడు. స‌మాచారంలో ఉన్న తీవ్ర‌త దృష్ట్యా మేం వెంట‌నే ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశాం.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. జిల్లాల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. రేటు తగ్గినా, గుడ్లు ఫ్రీ అన్న తినకండి!

 

ఆ ఫోన్ కాల్ చేసిన వ్య‌క్తి ఎవర‌నే విష‌య‌మై ద‌ర్యాప్తు చేస్తున్నాం అని ముంబ‌యి పోలీసులు చెప్పారు. ఇక పోలీసులు ద‌ర్యాప్తు త‌ర్వాత ఫోన్ చేసిన వ్య‌క్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, అత‌డి మాన‌సిక ప‌రిస్థితి సరిగా లేద‌ని, దీనిపై మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా, మోదీ ప్ర‌స్తుతం ఫ్రాన్స్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈరోజు కృత్రిమ మేధ‌ కార్యాచ‌ర‌ణ స‌ద‌స్సులో పాల్గొన‌నున్నారు. ఈ సద‌స్సు ముగిసిన అనంత‌రం ప్ర‌ధాని అమెరికా వెళ్ల‌నున్నారు. రెండు రోజుల పాటు యూఎస్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అగ్ర‌రాజ్యం కొత్త అధ్య‌క్షుడు ట్రంప్ ను క‌ల‌వ‌నున్నారు.   

 

ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మెగా డీఎస్సీపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌! ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

 

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గుడ్​న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!

 

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..

 

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

 

BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. మ‌రో స‌రికొత్త డేటా ప్లాన్‌! ప్ర‌తిరోజు 2జీబీ డేటా ఫ్రీ.!

 

జగన్ ఎంతకైనా తెగిస్తారు.. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన చంద్రబాబు!

 

ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. అది ఏంటంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PMModi #ThreatCall #MumbaiPolice #PMModiAircraft