Header Banner

ఏపీలో ఆరు లైన్లుగా కొత్త నేషనల్ హైవే! ఈ రూట్‌ లోనే!

  Sat Feb 08, 2025 10:40        Politics

ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హైవేలతో పాటూ మిగిలిన రోడ్లు, బైపాస్‌లు, ఫ్లై ఓవర్ల పనులు వేగవంతం అయ్యాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో రోడ్లను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. చిత్తూరు జిల్లా కేంద్రం చుట్టూ త్వరలోనే కొత్త రోడ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 4, 6, 8 వరసలుగా చేపట్టిన పనుల్లో స్పీడ్ పెంచారు. ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే తమిళనాడు, కర్ణాటకకు కనెక్టివిటీ మరింత పెరగనుంది. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే చిత్తూరు కేంద్రంగా గతంలోనే నిర్మాణం చేస్తున్నారు.. ఈ రోడ్డు పనులు వేగవంతం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!  

 

అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి సరకును నేరుగా పోర్టుకు తీసుకెళ్లేందుకు చిత్తూరు-తచ్చూరు మధ్య ఆరు వరుసల రోడ్డు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోడ్డు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలోనే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న మరో రోడ్డు కూడా చిత్తూరు జిల్లాలో 80 కిలోమీటర్ల మేర నిర్మిస్తుండగా.. ఆ పనులు కొనసాగుతున్నాయి. చిత్తూరు శివారు చీలాపల్లి, బైరెడ్డిపల్లె వద్ద మాత్రమే EXIT, ENTRY మార్గాలు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో రూ.3,800 కోట్లతో జరుగుతున్న చిత్తూరు- తచ్చూరు హైవే ఈ ఏడాది జూన్‌ నుంచి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

చెన్నై-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ వే నాలుగు లైన్ల నిర్మాణానికి రూ.17,930 కోట్లు వ్యయం చేశారు. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య దాదాపు నిర్మాణం ముగింపు దశకు వస్తోంది. ఈ ఐడాది డిసెంబర్‌ నాటికి రహదారి పూర్తి స్థాయిలోఅందుబాటులోకి వస్తుందంటున్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ వే ఆంధ్రప్రదేశ్‌లో 65కిలో మీటర్లు, మిగతా 105కిలో మీటర్లు, కర్ణాటకలో‌ మొత్తం 110 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం చెన్నై- బెంగళూరు మధ్య దూరం 360కిలో మీటర్లు ఉంటే.. ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అందుబాటులోకి వస్తే.. దాదాపు 80కిలోమీటర్ల దూరం తగ్గుతుందంటున్నారు. బెంగళూరు నుంచి చెన్నైకు కేవలం ఐదు గంటల్లో వెళ్లొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 65కిలోమీటర్లలో వెంకటగిరి, పలమనేరు, బంగారుపాలెం, చిత్తూరు, రాణిపేట్‌ మీదుగా తమిళనాడులోకి వెళుతుంది. తమిళనాడులో శ్రీపెరంబూర్‌, నుంచి చెన్నైకు వెళ్లొచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి!

 

జైల్లోకెళ్లి దస్తగిరికి బెదిరింపులు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం! జగన్ గెట్ రెడీ..

 

ఉగాది నుంచి ఏపీలో పీవిధానం అమలు! ఈ సలహాలుసూచనలు ఆధారంగానే..

 

ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఇక వాట్సప్‌లో! ప్రైవేట్ కాలేజీల వేధింపులకు చెక్! డౌన్‌లోడ్ చేయడం ఎలా?

 

నాకు భయం తెలియదు.. ఎలాంటి ప్రలోభాలకూ లొంగను! జగన్ వ్యాఖ్యలకు సాయిరెడ్డి ఘాటు కౌంటర్!

 

ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరి రూ. లక్షా 60 వేలు..

 

కొనసాగుతున్న కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర! వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో..

 

USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP