Header Banner

గగనతలంలో కొత్త ఆటగాళ్లు! నూతన విమాన సంస్థల రాకతో కస్టమర్లకు బంపర్ ఆఫర్ల పండుగ!

  Mon Mar 31, 2025 12:42        Business

భారతదేశంలోని విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజల ఆదాయాలు పెరగడంతో పాటు వేగవంతమైన ప్రయాణాలపై ఆసక్తి పెరగడం కూడా దీనికి కారణం. కేంద్ర పౌర విమానయాన శాఖ దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తోంది. గోఫస్ట్ సంస్థ మూతపడినా, శంఖ్ ఎయిర్, ఎయిర్ కేరళ, అన్హింద్ ఎయిర్ వంటి కొత్త సంస్థలు భారత గగనతలంలో తమ సేవలను ప్రారంభిస్తున్నాయి. శంఖ్ ఎయిర్ నోయిడా జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సేవలు అందించనుండగా, ఎయిర్ కేరళ, అన్హింద్ ఎయిర్ సంస్థలు దక్షిణ భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు కనెక్టివిటీ కల్పించనున్నాయి.

 

ప్రస్తుతం దేశంలోని 90% ప్రయాణికులకు రెండు ప్రధాన విమానయాన సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త సంస్థలు వచ్చాయి. ఎయిర్ కేరళ 2025లో దేశీయ సేవలను ప్రారంభించి, 2026లో అంతర్జాతీయ రూట్లలోకి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టూర్ ఆపరేటర్ అర్హింద్ గ్రూప్ అన్హింద్ ఎయిర్ ద్వారా విమానయాన వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఈ కొత్త సంస్థలు దేశీయ, అంతర్జాతీయ రూట్లలో సేవలు అందించి భారతదేశంలో విమానయాన రంగం అభివృద్ధికి దోహదపడే అవకాశముంది.

 

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

 

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #HeatWaveAP #APScorchingHeat #SummerAlert #StaySafeFromHeat #ExtremeHeat #HeatWaveCrisis