Header Banner

తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..

  Mon Mar 24, 2025 14:43        Politics

జనసేన పార్టీ విస్తరణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోరిక మేరకు జరగాలని ఉంటే... తమిళనాడులో జనసేన కచ్చితంగా అడుగు పెడుతుందని ఆయన అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంచి వ్యక్తి అని... ప్రత్యర్థులపై పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని ఆయన ఉదార వైఖరిని అభినందించాల్సిందేనని చెప్పారు. పార్టీ పెట్టడం ముఖ్యం కాదని... దాన్ని నిలబెట్టుకోవడమే ప్రధానమని అన్నారు. రాజకీయాల్లో ఎంతో ఓపిక అవసరమని చెప్పారు. సినీ నటులు రాజకీయాల్లో గెలవడం అంత ఈజీ కాదని అన్నారు. ఆ ఘనత కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమయిందని చెప్పారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అద్భుతమని కితాబునిచ్చారు. తమిళనాడులో అన్నాదురై, ఎంజీఆర్ ను తాను ఆదర్శంగా తీసుకుంటానని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు! విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా ఈరోజు..

 

ఎన్టీఆర్, ఎంజీఆర్ లకు వచ్చిన అవకాశం మరెవరికీ రాలేదని చెప్పారు. మనం ఎంత పాప్యులర్, మన వద్ద ఎంత డబ్బు ఉందనేది ముఖ్యం కాదని... మన ఐడియాలజీ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లిందనేదే ముఖ్యమని అన్నారు. రాజకీయరంగం అత్యంత కఠినమైనదని... ఇక్కడ అందరూ శత్రువులేనని పవన్ చెప్పారు. రాజకీయాల వల్ల వ్యక్తిగత జీవితం ప్రభావితమవుతుందని తెలిపారు. తమిళనాడులో విజయ్, పళనిస్వామి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో? లేదో? తాను చెప్పలేనని అన్నారు. ఇరువైపులా ఓట్ల షేరింగ్ జరుగుతుందా? అనేది కూడా అనుమానమేనని చెప్పారు. ఏపీలో టీడీపీ, జనసేన మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని అన్నారు. తమిళనాడులో టీవీకే, ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం కుదురుతుందో? లేదో? చెప్పలేమని అన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో నామినేటెడ్ పదవుల మూడో దఫా జాబితా సిద్ధం! కీలక పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు! సీఎం వద్దకు ఫైనల్ లిస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్, బాలయ్య, గోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

 

అమెరికాలో మరో దారుణ ఘ‌ట‌న‌.. భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను తుపాకీతో కాల్చి చంపిన దుండ‌గుడు!

 

వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు - ఏ-1గా మాజీ మంత్రి.! పోలీస్ రంగం సిద్దం - ఈ కేసులో మరో కీలక అంశం!

 

వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! పింఛన్ లో కొత్త మలుపు..

 

టీటీడీ కీలక అప్డేట్.. ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

 

గుడ్‌న్యూస్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆ దేశానికి డైరెక్ట్‌ ఫ్లైట్‌! వారానికి రెండుసార్లు ఈ విమాన సర్వీసు.!

 

విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...

 

ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్! ఇలా చేయండి, లేకపోతే పథకాలు రావు, సరుకులు కట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli