Header Banner

నాగబాబుకు ఎమ్మె ల్సీ పదవిపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం! ఏపీలో మరో పొలిటికల్ ట్విస్ట్!

  Tue Mar 04, 2025 09:49        Politics

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూ 3.22 లక్షల కోట్ల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు గ్రాడ్యుయేట్ సీట్లు కూటమికి దక్కగా.. మరో ఉపాధ్యాయ సీటు మాత్రం కోల్పోయింది. ఇటు బడ్జెట్ లో ప్రతిపాదించిన పథకాల అమలు పైన ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇక, ఎమ్మెల్యే కోటా లో అయిదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన చంద్రబాబు - పవన్ చర్చించారు. నాగబాబుకు ఎమ్మె ల్సీ - మంత్రి పదవి పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు - పవన్ చర్చలు ఏపీలో ఎమ్మెల్యే కోటాలో అయిదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన చంద్రబాబు - పవన్ చర్చించారు. ఈ అయిదు స్థానాల్లో ఒకటి జనసేన.. మరొకటి బీజేపీకి కేటాయింపు పైన చర్చ జరిగింది. జనసేన నుంచి నాగబాబు కు సీటు ఖాయమైంది. బీజేపీకి త్వరలో సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభ సీటు దక్కనుండటంతో.. ఎమ్మెల్సీ సీటు ఈ సారికి మినహాయింపు ఇచ్చేలా ఈ ఇద్దరి మధ్య ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.


ఇది కూడా చదవండినామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ!  పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!


బీజేపీ నాయకత్వం పట్టు బడితే సీటు కేటాయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోని తీసుకుంటామని రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై కొద్దిసేపు చర్చించారు. ఎమ్మెల్సీగా మెగా బ్రదర్ ఇప్పుడు ఇదే అంశం పైన చంద్రబాబు - పవన్ మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయిదు స్థానాలు కూటమికే దక్కనుండటంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే, నాగబాబుకు మంత్రి పదవి పైన ఇప్పటికే పవన్ స్పష్టత ఇచ్చారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదని, పనిమంతుడా కాదా అనేది మాత్రమే చూస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పిం చామని గుర్తు చేశారు. ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తామని చెప్పిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.


ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


ఇప్పుడు పవన్ చెప్పిన విధంగా నాగబాబుకు ముందుగా ఎమ్మెల్సీగా చేసేందుకు చంద్రబాబుతో భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఉగాది వేళ నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకునే అంశం పైన చర్చించినట్లు తెలుస్తోంది. కేబినెట్ లోకి నాగబాబు అయితే, మంత్రివర్గంలో కొన్ని మార్పులు - చేర్పులు అవసరమే చర్చ జరిగినా.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా అవ్వగుండా మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు నాగబాబుకు మంత్రిపదవి ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఈ ఇద్దరి సమావేశంలో మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపైనా వారి మధ్య చర్చ జరిగిం ది. నాగబాబుకు శాఖ కేటాయింపు పైన సూచించాని పవన్ ను చంద్రబాబు కోరినట్లు సమాచారం. పవన్ మాత్రం చంద్రబాబుకే నిర్ణయాధికారం అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో, నాగబాబుకు కేటాయించే శాఖల పైన జనసేనలో ఆసక్తి కనిపిస్తోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం!  రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!



పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!


బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?


రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..


చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..

ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!

రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #nagababu #mlc #seat #todaynews #flashnews #latestnews