Header Banner

పేటీఎం యాప్ ఉసెర్స్ కి గుడ్ న్యూస్.. మ‌రో కొత్త స‌ర్వీస్‌ ప్రారంభం! భార‌త్ తో స‌హా ఇత‌ర దేశాల్లోని..

  Mon Feb 10, 2025 14:45        Politics

పేటీఎం యాప్ లో మ‌రో కొత్త స‌ర్వీస్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ యాప్ లో ఇక‌పై హోట‌ల్ బుకింగ్ సేవ‌లు కూడా పొందవచ్చు. దీనికోసం పేటీఎం బ్రాండ్‌పై సేవ‌లు అందిస్తున్న వ‌న్‌97 క‌మ్యూనికేష‌న్స్ డిజిట‌ల్స్‌... ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ అగోడాతో ఒప్పందం చేసుకుంది. భార‌త్ తో స‌హా ఇత‌ర దేశాల్లోని హోట‌ళ్ల బుకింగ్ ఆప్ష‌న్ ను త‌న యాప్ ద్వారా అందించ‌నుంది. ఇక ఇప్ప‌టికే పేటీఎం ట్రావెల్ ద్వారా విమానం, రైలు, బ‌స్ టికెట్ బుకింగ్ స‌దుపాయాన్ని అందిస్తున్న విష‌యం తెలిసిందే. పేటీఎం ట్రావెల్ లో హోట‌ల్ బుకింగ్ ఆప్ష‌న్ ను తీసుకురావ‌డం కీల‌క ముంద‌డుగు అని పేటీఎం ట్రావెల్ సీఈఓ వికాశ్ జ‌లాన్ తెలిపారు. ఈ భాగ‌స్వామ్యం ద్వారా స‌మ‌గ్ర సేవ‌లు అందించే సంస్థ‌గా అవ‌తారించామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అటు పేటీఎంలో హోట‌ల్ బుకింగ్ ఆప్ష‌న్ ద్వారా టూరిస్టుల‌కు ఇక‌పై హోట‌ల్ బుకింగ్ అనేది మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంద‌ని అగోడా అధికారి డామియ‌న్ పీచ్ చెప్పారు. 

 

ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. ఆ ఇళ్లన్నీ వారికే! ఈ పని త్వరగా చేయాలి.. మంత్రి కీలక అప్డేట్!

 

ఏపీ మంత్రి మానవత్వం.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా..

 

ఓరి దేవుడా.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్! 300 కి.మీ. మేర నిలిచిన వాహనాలు! అది ఎక్కడో తెలుసా?

 

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం! నలుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు!

 

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PaytmApp #Paytm #Travel #AgodaHotel #Bookings