Header Banner

శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం!

  Mon Mar 10, 2025 10:29        Travel

ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన పైలట్ అప్రమత్తత కారణంగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవా నుంచి 150 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్ లైన్స్ 66973 విమాన సర్వీసు శంషాబాద్ మీదుగా విశాఖకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ విమానానికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ విమానం హైడ్రాలిక్ గేర్‌ను సిద్ధం చేశాడు. విమాన సర్వీసును డౌన్ చేసిన పైలట్.. అప్పటికే రన్ వేపై టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించి అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని టేకాఫ్ చేసి, పెను ప్రమాదం తప్పింది. పది నిమిషాల సేపు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ విమాన సర్వీస్ విశాఖకు వెళ్లిపోయింది. అయితే.. రన్ వేపై టేకాఫ్ తీసుకోవడానికి ఒక విమానం ఉండగా, మరో విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి ఇవ్వడాన్ని ప్రయాణికులు తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పడంతో అతన్ని అభినందిస్తున్నారు.  

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూ, వారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #AirportFlight #Shamshabad #Telangana