Header Banner

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

  Thu Apr 24, 2025 14:32        Politics

ప‌హల్గామ్‌లో పాశ‌విక దాడితో న‌ర‌మేధం సృష్టించిన ఉగ్ర‌వాదుల‌కు ప్ర‌ధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడి త‌ర్వాత బిహార్‌లో జ‌రిగిన‌ ఓ ప్ర‌జా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాని.. తొలిసారి ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిపై నేరుగా స్పందించారు. అమాయ‌కులైన ప్ర‌జ‌ల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ఉగ్ర‌వాదుల‌ను వారు క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా శిక్షిస్తామ‌ని తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. "ఈ క‌ష్ట స‌మ‌యంలో బాధిత కుటుంబాల‌కు యావ‌త్ దేశం అండ‌గా ఉంది. క్ష‌త‌గాత్రుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కార్గిల్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు ప్ర‌తిఒక్క‌రిలోనూ బాధ‌, ఆగ్ర‌హం ఉన్నాయి. ఈ ఉగ్ర‌దాడి వెనుక ఉన్న‌వారు.. ఇందులో భాగ‌మైన వారికి ఊహ‌కంద‌ని రీతిలో శిక్ష విధిస్తాం. ఉగ్ర‌మూక‌ల వెన్నెముక‌ను 140 కోట్ల మంది భార‌తీయులు విరిచేస్తారు. ఈ విప‌త్క‌ర పరిస్థితిని ఎదుర్కొనేందుకు యావ‌త్ భార‌త్ దృఢ సంక‌ల్పంతో ఉంది.

 

ఇది కూడా చదవండి: రేపు ఏపీ సీఎం హస్తిన బాట.. సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ! ఎందుకంటే.!

 

అమాయ‌కులైన ప్ర‌జ‌ల‌ను ఉగ్ర‌వాదులు అతికిరాత‌కంగా చంపేశారు. ఈ దుర్మార్గ‌మైన దాడుల‌కు తెగ‌బ‌డ్డ‌వారు ఎక్క‌డున్నా తీసుకొచ్చి మ‌ట్టిలో క‌లిపేసే స‌మ‌యం వ‌చ్చింది. ముష్క‌రులు క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా వారిని శిక్షిస్తాం. ఇది ప‌ర్య‌ట‌కుల‌పై జ‌రిగిన దాడి కాదు... భార‌త్‌పై జ‌రిగిన దాడిగా భావిస్తున్నాం. దాడుల‌కు పాల్ప‌డిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు" అని ప్ర‌ధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా భార‌త్‌కు అండ‌గా నిలిచిన విదేశాల‌కు ప్ర‌ధాని మోదీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. మాన‌వ‌త్వాన్ని విశ్వ‌సించే ప్ర‌తిఒక్క‌రూ త‌మ‌కు అండ‌గా నిలిచార‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. వారంద‌రికీ పేరుపేరునా కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఉగ్ర‌వాదంతో భార‌త ఐక‌మ‌త్య స్ఫూర్తిని బ‌ద్ద‌లుకొట్ట‌లేర‌ని, ఉగ్ర‌వాదానికి శిక్ష త‌ప్ప‌ద‌ని ప్ర‌ధాని మోదీ చెప్పుకొచ్చారు.  

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

 

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!

 

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #AndhraPradesh #delhi #Election2024 #APPolitics #india #JPNadda #BJPParty #BJPJPNadda