Header Banner

తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!

  Sun Mar 02, 2025 16:55        Others

గుంటూరు జిల్లా తాడేపల్లి కొండలో నల్లగా ఒంటిపై మచ్చలతో ఉన్న నాలుగు కాళ్ల జంతువు చెంగు చెంగు మంటూ ఎగురుతూ కనిపించింది. అది ఒక్కసారిగా ఇంట్లోకి దూరడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మొదట ఆ జంతువు ఏంటో అన్న కంగారులో దూరంగా పారిపోయారు. అదే సమయంలో జనసమ్మర్ధం పెరిగిపోవడంతో ఆ జంతువు కూడా వారిని చూసి ఇళ్లలోకి వెళ్లి దాక్కోవడం మొదలు పెట్టింది. అయితే అర గంట గడిచిన తర్వాత స్థానిక యువకులు పారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఒక ఇంట్లో మెట్ల కిందకి దూరిన పునుగు పిల్లా పారిపోకుండా యువకులు అట్ట పెట్టెలు, బుట్టలు అడ్డుపెట్టారు. కొద్ది సేపటి తర్వాత పారెస్ట్ అధికారులు వచ్చి పునుగు పిల్లిని పట్టుకుని మంగళగిరి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.


ఇది కూడా చదవండి: UAE: యువ బైకర్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు! ఇలా చేస్తే భారీ జరిమానా, కఠిన చర్యలు!


పునుగు పిల్లి అంతరించి పోతున్న జీవుల్లో ఉందని ఇప్పుడు తాడేపల్లి కొండ ప్రాంతంలో కనపించడం ఆశ్చర్యంగా ఉందని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఒక్క పునుగు పిల్లే ఉండటం సాధ్యం కాదని మరికొన్ని ఉండే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగా శేషచల అడవుల్లో పునుగు పిల్లులు ఎక్కువుగా ఉంటాయి. వీటి తైలంతోనే తిరుమల వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ చేస్తారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వీటిని సంరక్షించి శేషాచల అడవుల్లో వీటి సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. అటువంటి అరుదైన పునుగుపిల్లి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఈ అరుదైన జంతువుల జాడ కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చేపట్టారు.


ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

 

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #animal #wildanimal #amaravathi #thadepalli #todaynews #flashnews #latestnews