Header Banner

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. తొలి భారతీయుడిగా రికార్డు!

  Mon Apr 21, 2025 09:58        Sports

ఐపీఎల్ 18వ సీజ‌న్ ఈసారి అభిమానుల‌కు మంచి కిక్ ఇస్తోంది. భారీ అంచ‌నాలు ఉన్న జ‌ట్లు బేజారు అవుతుంటే... ఎలాంటి అంచ‌నాలు లేని జ‌ట్లు మంచి విజయాల‌తో దూసుకెళ్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆదివారం ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే), ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు జ‌రిగింది. ఈ మ్యాచ్ లో చెన్నైను ముంబ‌యి ఏకంగా 9 వికెట్ల తేడాతో మ‌ట్టిక‌రిపించింది. దీంతో సీఎస్‌కే ప్లేఆఫ్ అవ‌కాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్ లు ఆడిన చెన్నై కేవ‌లం రెండు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున ఉంది. మ‌రోవైపు ఎంఐ ఈ విజ‌యంతో ప్లేఆఫ్ అవ‌కాశాల‌ను మెరుగుప‌ర‌చుకుంది. 

 

ఇది కూడా చదవండి: నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఇక‌, ఈ మ్యాచ్ లో అజేయంగా 76 ప‌రుగులు బాదిన రోహిత్ శ‌ర్మ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఇది అతనికి ఐపీఎల్‌లో 20వ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ (పీఓటీఎం). త‌ద్వారా హిట్‌మ్యాన్ త‌న ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. ఐపీఎల్ అత్య‌ధిక పీఓటీఎంలు సాధించిన భార‌త ఆట‌గాడిగా నిలిచారు. ఓవ‌రాల్‌గా ఈ జాబితాలో ఏబీ డివిలియ‌ర్స్ (25), క్రిస్ గేల్ (22) త‌ర్వాత రోహిత్‌ మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. అత‌ని త‌ర్వాత విరాట్ కోహ్లీ (19) ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. అలాగే ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో శిఖ‌ర్ ధావ‌న్‌(6,769)ను వెన‌క్కి నెట్టి 6,786 ర‌న్స్ తో హిట్‌మ్యాన్ రెండో స్థానానికి ఎగ‌బాకాడు. ఈ జాబితాలో కింగ్ కోహ్లీ 8,326 ప‌రుగుల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

    

ఇది కూడా చదవండి: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!

 

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

నేడు భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు.. మోడీతో భేటీ - ఏపీలో ఆ జిల్లాకి రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారు..

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia