Header Banner

అన్నంత పని చేసిన ట్రంప్.. భారత్‌పై ప్రతీకార సుంకాలు షురూ.. ఎంతో తెలుసా.?

  Thu Apr 03, 2025 19:09        U S A

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌పంచంలోని అనేక దేశాల‌పై ప‌ర‌స్ప‌ర సుంకాలు విధించారు. పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేగాక పెంచిన సుంకాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపారు. అధికార భ‌వ‌నం వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఈ రోజును 'లిబరేషన్ డే'గా నిర్వచించిన ట్రంప్, ఈ ప్రత్యేక సమావేశానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ రంగ కార్మికులను ఆహ్వానించారు. ఇక భార‌త్‌తో పాటు చైనాపై భారీగానే పరస్పర సుంకాలను విధించారు. అయితే, ఆయా దేశాలు త‌మ నుంచి వసూలు చేస్తున్న సుంకాల్లో తాము స‌గ‌మే విధిస్తున్న‌ట్లు, త‌ద్వారా తాము వారిపై దయతో ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా ట్రంప్ తెలిపారు. వీటిని 'రాయితీ పరస్పర సుంకాలు' అని పేర్కొన్నారు. ఇక‌ భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం దిగుమతి సుంకాన్ని అమెరికా వసూలు చేస్తుందని ట్రంప్ ప్ర‌క‌టించారు. భారతదేశం గురించి మాట్లాడుతూ... న్యూఢిల్లీ విధించిన సుంకాలను చాలా కఠినమైనవి అని ఆయన అభివర్ణించారు.

 

ఇది కూడా చదవండి: ట్రంప్ టారిఫ్ ప్రభావం! గడగడలాడుతున్న ప్రపంచం మార్కెట్లు!

 

"వారి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే యూఎస్ వ‌చ్చి వెళ్లారు. ఆయన నాకు మంచి మిత్రుడు. కానీ నేను ఆయ‌న‌తో 'నువ్వు నా స్నేహితుడు, కానీ నువ్వు మాతో సరిగ్గా వ్యవహరించడం లేదు' అని చెప్పాను. ఇండియా మా నుంచి 52 శాతం సుంకం వసూలు చేస్తుంది. కాబట్టి మేము దానిలో సగం 26 శాతం వసూలు చేస్తాం" అని  ట్రంప్ అన్నారు. అలాగే అమెరికాకు ప్రధాన వాణిజ్య భాగస్వాములు, మిత్రదేశాలు అయిన యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతులపై 20 శాతం, యూకేపై 10 శాతం సుంకాన్ని అధ్యక్షుడు ప్రకటించారు. జపాన్‌పై కూడా ఆయన 24 శాతం సుంకాన్ని విధించారు. అయితే, పరిశ్రమల వారీగా ఈ సుంకాలను ఎలా విధిస్తారో అధ్యక్షుడు ట్రంప్ వివరించలేదు. "ఇలా చేయడం ద్వారా మనం మన ఉద్యోగాలను తిరిగి పొందుతాం. మన పరిశ్రమను తిరిగి పొందుతాం. మన చిన్న, మధ్య తరహా వ్యాపారాలను తిరిగి పొంద‌డం జ‌రుగుతుంది. త‌ద్వారా అమెరిక‌న్ల‌ను మళ్లీ సంపన్నులను చేస్తాం. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు గర్జిస్తూ వస్తాయి" అని అధ్య‌క్షుడు ట్రంప్‌ అన్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNews #USAPolice #USAPoliceNewdeathsentence #deathsentence #Nitrogengas #Nitrogengasdeathsentence