Header Banner

QR కోడ్‌ స్కాన్‌ చేస్తున్నారా.. మీ బ్యాంక్‌ ఖాతా రక్షించుకోండి! సైబర్ నేరగాళ్ల కొత్త టెక్నిక్!

  Sat Apr 19, 2025 19:06        Others

క్యూఆర్‌ కోడ్‌. చిరు వ్యాపారుల నుంచి బడా బిజినెస్‌ మ్యాన్‌ల వరకూ అందరి ఆర్థిక వ్యవహారాల్లో క్యూ ఆర్‌ కీలకం అయిపోంది. ఫోన్‌ కెమెరాతో స్కాన్‌ చేయడం.. పేమెంట్‌ చేసేయడం.. సెలెబ్రిటీలు కన్‌ఫర్మ్‌ చేయడం.. అంతా బాగానే ఉంది. కానీ, ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా? కన్‌ఫ్యూజన్‌గా కనిపించే ఈ క్యూఆర్‌ కోడ్‌ని ఎవరైనా మార్చేస్తే? స్కాన్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్ల గాలానికి చిక్కితే? బ్యాంక్‌ ఖాతా అంతా ఖాళీ అయితే..’ అప్పుడు పరిస్థితి ఏంటి? ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో డూప్లికేట్‌ క్యూఆర్‌ కోడ్‌లు సృష్టిస్తున్నారు. కస్టమర్ల ఫోన్లలోకి మాల్వేర్‌ జొప్పిస్తున్నారు. అచ్చంగా అసలైన కోడ్‌ మాదిరిగానే కనిపిస్తుంది.
ఇన్‌స్టాల్‌ అయిన మాల్వేర్‌ – వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరిస్తుంది. అయితే ఇక్కడే కొద్దిపాటి జాగ్రత్త పాటిస్తే, మోసపోకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యూఆర్‌ కోడ్స్‌కు సంబంధించి ఏది కరెక్ట్‌, ఏది ఫేక్‌ అన్నది తెలియకపోవడం ప్రధాన సమస్య. చాలా చోట్ల క్యూఆర్‌ కోడ్స్‌ ఇప్పుడు ఉంటున్నాయి. ఉదాహరణకు పార్కింగ్‌ ఫీజు వసూలు చేసే చోట ఉండే క్యూఆర్‌ కోడ్‌ని సెక్యూరిటీ సిబ్బంది అంతగా పట్టించుకోరు. అక్కడ స్కామర్లు తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. అదేవిధంగా వర్చువల్‌ మెనూ కార్డ్‌ను స్కాన్‌ చేసినప్పుడు అక్కడ సైబర్‌ క్రిమినల్స్‌ రియల్‌ కోడ్‌ని రీప్లేస్‌ చేయగలుగుతారు. అదేవిధంగా పే చేయాల్సిన బిల్లుల విషయంలోనూ మోసాలకు తెరలేపే అవకాశాలు ఉంటాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #CyberAlert #QRCodeScam #BankFraud #DigitalSafety #CyberSecurity #StaySafeOnline