Header Banner

వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!

  Thu Mar 13, 2025 22:11        India

మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. రేవా జిల్లాలో ఓ వీధి కుక్క, నోట్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డ శవాన్ని పట్టుకుని వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ దృశ్యాలను చూసిన స్థానిక యువకులు బైక్‌పై కుక్కను వెంబడిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తున్న విషయం ఏమిటంటే, గత నెలన్నర రోజులుగా ఇదే తరహాలో మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఈ సంఘటనపై రేవా జిల్లా పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ, ఇలాంటి ఘటనల వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. నవజాత శిశువుల మృతదేహాలను ఎవరు విసిరిపెడుతున్నారనే విషయాన్ని వెల్లడించేందుకు పోలీసులు తీవ్రంగా పరిశోధిస్తున్నారు. ఎవరైనా దీనికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే, పోలీసులకు అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మరోవైపు, వైరల్ వీడియోను కూడా పోలీసులు పరిశీలిస్తూ, ఈ ఘటనలపై మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తరచుగా ఇలాంటి దారుణ ఘటనలు చోటు చేసుకోవడం రేవా నగర వాసుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

భ‌లేదొంగ‌లు.. ఎత్తుకెళ్లిందెంటో తెలిస్తే షాక‌వ్వాల్సిందే.. ఏక కాలంలో ఇలా.!

 

ఏపీతెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #MadhyaPradesh #ShockingIncident #InfantAbandonment #RewaNews #SocialAwareness