Header Banner

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

  Sun Apr 27, 2025 14:23        Politics

శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలపై నమోదైన కేసులో భోలేబాబా డెయిరీలో పనిచేసే ఆశిష్, మరో వ్యక్తిని సిట్ అరెస్టు చేసింది. శనివారం వారికి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బాలాజీ బస్టాండులోని సిట్ కార్యాలయంలో విచారణ సాగించారు. శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిని సరఫరా సంస్థలు కల్తీ చేశాయని ప్రొక్యూర్మెంట్ జీఎం తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు సీబీఐ జేడీ, ఎస్పీతో కూడిన సిట్ను నియమించింది. తిరుపతి కేంద్రంగా సిట్ విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఓ బృందం రెండు నెలలుగా భోలేబాబా డెయిరీ ఉన్న ఉత్తరాఖండ్లోనే మకాం వేసి ఇద్దరిని అరెస్టు చేసింది.

 

ఇది కూడా చదవండి: BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్.. రెండు కొత్త రీచార్జ్ ప్లన్స్! అతి తక్కువ ధరకే - మీ ఫ్యామిలీకి స్పెషల్ గా!

 

బోలేబాబా డెయిరీలో పనిచేసే ఆశిష్, మరో వ్యక్తిని సిట్ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా విచారిస్తున్నారు. భోలేబాబా డెయిరీలోనే నెయ్యి కల్తీ చేసి, తిరుపతి సమీపంలోని వైష్ణవి డెయిరీ ద్వారా తితిదేకు సరఫరా చేశారని గుర్తించారు. ఇందులో నిర్వాహకుల పాత్ర, కల్తీలో ఉద్యోగుల తీరును ఆరా తీసినట్లు సమాచారం. కల్తీ నెయ్యి కేసుకు సంబంధించిన మొదటి ఛార్జిషీట్ త్వరలో వేయనున్నట్లు సమాచారం. కేసుకుసంబంధించి ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేశాయి. నిందితులను అరెస్టు చేసి, విచారణలో అసలు విషయాలు తెలుసుకున్నారు. రిమాండ్ రిపోర్టు ప్రకారం ఛార్జిషీట్ వేయనున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirupati #DharmaReddy #BhumanaKarunakarReddy #TDP #Case