Header Banner

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

  Sat Apr 26, 2025 14:41        Politics

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్షుల వరుస మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో కీలక సాక్షిగా ఉండి ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించినట్లు సమాచారం. వివేకా హత్య కేసులో మొదటి నుంచి సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరుగురు సాక్షులు ఇలా మరణించడంతో, ముఖ్యంగా కీలక సాక్షి రంగన్న మృతి తర్వాత, ప్రభుత్వం ఈ వరుస మరణాలపై దృష్టి సారించి సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సిట్ అధికారులు పులివెందులలో ఉంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా, వివేకా హత్య కేసులో మరో సాక్షిగా ఉన్న కసునూరు పరమేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు నేడు విచారిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

మొదట తనకు నోటీసులు ఇవ్వలేదని పరమేశ్వర్ రెడ్డి వాదించినప్పటికీ, పోలీసులు ఆయనను ఇంటి నుంచి పులివెందులలోని విచారణ కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. తాజాగా, ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు కూడా సిట్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. రంగన్న మృతికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆమె నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. సుశీలమ్మను కూడా ఈ రోజు సాయంత్రం విచారించవచ్చని భావిస్తున్నారు. కేసులో సాక్షులుగా ఉండి మరణించిన వారందరి బంధువులను, సన్నిహితులను కూడా సిట్ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వరుస మరణాల వెనుక ఉన్న కారణాలను నిగ్గు తేల్చేందుకు సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

 

నేడు (26/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #AndhraPradesh #APpolitics #APNews #polices