Header Banner

శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం.. సీఎం చంద్రబాబు దంపతుల పట్టువస్త్ర సమర్పణ! నేతల సమక్షంలో విశేష వైభవం!

  Sun Mar 16, 2025 09:01        Politics

రాజధాని అమరావతి పరిధిలోని వెంక‌ట‌పాలెంలో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీనివాస క‌ల్యాణం క‌న్నుల పండువ‌గా జరిగింది. భారీ ఏర్పాట్ల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి కల్యాణాన్ని చూసి తరించారు. శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వానికి గవ‌ర్న‌ర్‌ ఎస్ అబ్దుల్ నజీర్‌, ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు. విష్వక్సేనుడిని శ్రీవేంకటేశ్వర స్వామి సర్వసైన్యాధిపతిగా భావిస్తారు. స్వామివారి కళ్యాణోత్సవం, ఇతర ఉత్సవాలు, ఊరేగింపు ఆరంభం కావడానికి ముందు అక్కడి ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తారు. అందుకే- ఉత్సవాలకు ముందు విష్వక్సేనుడి ఆరాధానతో కల్యాణోత్సవం ప్రారంభమైంది. అనంతరం అర్చకులు శుద్ధి- పుణ్యాహవచనం నిర్వహించారు.


ఇది కూడా చదవండి: కార్యకర్త హఠాన్మరణంపై పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం.. ఎలా చనిపోయారనే విషయంలో..


శుద్ధి చేసిన నీటిని హోమకుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లారు. అనంతరం ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ క్రతువులో అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు. ఆ తరువాత ప్రతిష్టా బంధన క్రతువు చేపట్టారు. అర్చకులు పవిత్రమైన కంకణాలను ఉత్సవ మూర్తులకు కట్టారు. అనంతరం ప్రాయశ్చిత్త హోమం, దేవతలకు కొత్త పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణోత్సవం సందర్భంగా తాళ్లపాక వంశస్థులు అమ్మవారి తరపున కన్యాదానం చేశారు. శ్రీ‌నివాసుడి గోత్రం భార‌ద్వాజ‌, శ్రీ‌దేవి అమ్మ‌వారిది భార్గ‌వ‌స, భూదేవి అమ్మ‌వారిది కాశ్య‌ప‌స‌ గోత్ర ప్రవరాలను అర్చ‌కులు పఠించారు. తరువాత మాంగల్య ధారణతో దైవిక వివాహ వేడుక ఘనంగా ముగిసింది. కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు దంపతులు శాస్త్రోక్తంగా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.


ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ! 60 వేల దరఖాస్తుల పరిశీలన! కొనసాగుతున్న కసరత్తు!


ముందుగా వారు ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు బహూకరించారు. గవర్నర్‌ ఎస్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు నాయుడు దంప‌తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వివిధ పీఠాధిపతులు ఆశీర్వచనాలు పలికారు. తిరుమల పెద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, అహోబిలం పీఠాధిపతి శివస్వామి, శ్రీకమలానంద స్వామి, ఇతర పీఠాధిపతుల నుండి ఆయన ఆశీస్సులను స్వీకరించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు కలకలం.. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా.!

 

నేటితో గొడ్డలి వేటుకు ఏళ్లు! కీలక సాక్షులు అనుమానాస్పద మృతి! బయటకు రానున్న నిజాలు!

 

 రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!

 

 గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #rajadhani #amaravathi #venkateswaraswamy #brahmosthavalu #todaynews #flashnews #latestnews