Header Banner

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

  Tue Apr 08, 2025 12:09        Politics

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు(Sujay Krishna Ranga Rao), సభ్యుడిగా వడ్లమాని సుధాకర్ చౌదరి(Vadlamani Sudhakar Chowdhury) ఎన్నికయ్యారు. ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది. త్వరలో జరగనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(Andhra Cricket Association) APL లీగ్ – 2025 నిర్వహణ బాధ్యతలను చైర్మన్ హోదాలో సుజయ్‌కృష్ణ రంగారావు చేపట్టనున్నారు. పోటీల నిర్వహణ తేదీలు, ఫ్రాంచైజీల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్ష కార్యదర్శులు కేశినేని శివనాథ్ (చిన్ని), సానా సతీష్ బాబు, అపెక్స్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సుజయ్‌కృష్ణ రంగారావు 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ మరణానంతరం 2012లో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాష్ట్రంలో నాడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడటంతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. 2016లో చంద్రబాబు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి తొలిసారి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో తిరిగి బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

 

చేసే సేవకు గుర్తింపు రావాల్సిన వయసులో.. డిప్యూటీ కలెక్టర్‌ మృతి దిగ్భ్రాంతికరం! మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి!

 

అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం! డిప్యూటీ కలెక్టర్ మృతి! చంద్రబాబు సంతాపం!

 

జగన్‌కు ఊహించని షాక్‌! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!

 

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలు, ఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations