Header Banner

నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ! 60 వేల దరఖాస్తుల పరిశీలన! కొనసాగుతున్న కసరత్తు!

  Sat Mar 15, 2025 07:10        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై పలు కీలక విషయాలను చర్చించారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, సంక్షేమ పథకాల అమలులో ఏ విధమైన వివక్ష ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా అందరికీ అందుతాయని తెలిపారు. తాము ఏ నియోజకవర్గంలోనైనా పథకాలు అందించడంలో వివక్ష చూపమని, కానీ రాజకీయంగా వైసీపీ నేతలతో ఎవరూ సంబంధాలు పెట్టుకోవద్దని కఠినంగా హెచ్చరించారు.


ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

ఇన్‌చార్జి మంత్రులు తప్పనిసరిగా జిల్లాల్లో పర్యటించి, ప్రభుత్వ పథకాల అమలును ప్రజలకు వివరించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును స్థానిక ప్రజాప్రతినిధులు నిశితంగా పర్యవేక్షించాలని కోరారు. అలాగే, గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంటులో తమ ప్రాంత సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

 

నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ జరుగుతోందని, పార్టీ కోసం కృషి చేసిన వారిని సరైన పదవుల్లో నియమిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే 60 వేల దరఖాస్తులు అందాయని, వాటిని పరిశీలించి అర్హులైనవారికి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నామినేటెడ్‌ పదవులు చేపట్టిన వారు తమ బాధ్యతను హుందాగా నిర్వహించాలని, పదవులు కేవలం హోదా కోసం కాకుండా పార్టీకి, ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #NominatedPosts #PoliticalAppointments #Leadership #GovernmentUpdates #TDP #ChandrababuNaidu #TDPGovernment