Header Banner

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

  Sat Apr 12, 2025 11:42        Politics

తెలంగాణ రాష్ట్రంలో ఆకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంట నష్టాలను ఎదుర్కొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. ఎకరానికి రూ.10,000 చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించనున్నట్లు సమాచారం. గత నెలలో 8,408 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడించగా, ఈ నెలలో కురిసిన అకాల వర్షాలతో ఈ నష్టం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో వరి, మొక్కజొన్న, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నష్టపోయిన రైతుల వివరాలను రైతువారీగా సర్వే చేసి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్వే ఆధారంగా పరిహారం పంపిణీ చేయనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 450 ఎకరాలు, ములుగులో 148 ఎకరాలు, వరంగల్‌లో 63 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా పంట నష్టం నమోదైంది.

 

ఇది కూడా చదవండి: విజయశాంతి భర్తను రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా.. సోషల్ మీడియాలో ప్రమోషన్.!

 

రైతులు ఈ పరిహారం ద్వారా కొంత ఆర్థిక ఊరట పొందే అవకాశం ఉందనీ, అయితే నష్టం పూర్తి స్థాయిని కచ్చితంగా నిర్ధారించడానికి సర్వే పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిహారం పంపిణీ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. నిజంగా ఇదో మంచి నిర్ణయం. ఐతే.. కొంతమంది రైతులకు ఇంతకంటే ఎక్కువ నష్టం జరిగివుండొచ్చు. ఎకరానికి కొంతమంది రైతులకు రూ.30 వేల దాకా ఆదాయం వస్తూ ఉండొచ్చు. అలాంటి వారు పంట నష్టపోతే, వారికి రూ.10వేల చొప్పున ఇస్తే సరిపోదు. కానీ.. కనీసం ఆ మాత్రం కూడా ఇవ్వకపోతే, రైతులకు ఇంకా భారం అవుతుంది. అందువల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది అనుకోవచ్చు. ప్రస్తుతం రైతులు వరి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. రోడ్లపైనే ఆరబెడుతున్నారు. ఐతే.. తెలంగాణలో 4 రోజులు వర్ష సూచన ఉంది. దక్షిణాదిన ఉన్న ద్రోణి వల్ల మేఘాలు తెలంగాణకు వస్తున్నాయి. అందువల్ల ఈ ధాన్యం తడిసిపోవచ్చు, అలాగే మిగతా పంటలూ పాడవ్వవచ్చు. మామిడి కాయలు రాలిపోవచ్చు. ఇలా చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల పరిహారం ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమే. ఇప్పుడు రైతులు ఏం చెయ్యాలంటే.. తమ దగ్గరకు వచ్చే అధికారులతో ఎంత నష్టం జరిగిందో, ఏయే పంటలు నష్టపోయారో వివరించారు. ఒకవేళ అధికారులు రాకపోతే.. రైతులే వ్యవసాయ శాఖ ఆఫీసుకి వెళ్లి.. ప్రభుత్వం ఇలా రూ.10వేల పరిహారం ఇవ్వాలనుకుంది కాబట్టి.. ఆ ప్రకారం.. నష్టం వివరాలను తీసుకోమని కోరవచ్చు. అప్పుడు అధికారులు.. తిరిగి పొలాల దగ్గరకు వచ్చి.. నష్టాన్ని అంచనా వేస్తారు. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర పంటలకు సంబంధించిన సమాచారం రెడీగా ఉంది. అందువల్ల పంటల్ని చూడగానే ఎంత నష్టం వచ్చిందో పక్కాగా తెలుస్తుంది. దాంతో.. త్వరగా పరిహారం ఇవ్వడానికి వీలవుతుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices