Header Banner

టీడీపీ పెద్దాయనకు గవర్నర్ పోస్టు రెడీ! త్వరలో అధికారిక ప్రకటన!

  Mon Apr 21, 2025 10:54        Politics

ఏపీలో ఈసారి బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రంలో రెండు మంత్రి పదవుల్ని కూడా టీడీపీ చేజికకిచ్చుకుంది. అయితే దీంతో పాటు మరికొన్ని కీలక పదవులు కూడా టీడీపీకి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ హింట్స్ ఇస్తున్నట్లు చర్చలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా త్వరలో టీడీపీ సీనియర్ నేతకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు రంగం సిద్దమవుతోంది.

 

తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. మధ్యలో ఒక ఓటమి మినహాయిస్తే వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుస్తూ రాష్ట్రమంత్రిగా, కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనది. టీడీపీలో చంద్రబాబుతో సమానమైన సీనియారిటీ ఉన్న అశోక్ గజపతిరాజుకు అవినీతి మరకలు అస్సలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది.


ఇది కూడా చదవండిరాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

దీంతో టీడీపీకి కేంద్రం తరఫున లభించే తొలి గవర్నర్ పోస్టును అశోక్ గజపతిరాజుకు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో నాలుగు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం మార్చే అవకాశం ఉంది. ఇందులో అశోక్ గజపతిరాజుకు ఛాన్స్ లభించబోతున్నట్లు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది. గవర్నర్ పోస్టు కోసం అశోక్ గజపతిరాజుతో మరో సీనియర్ నేత అయిన యనమల రామకృష్ణుడు కూడా పోటీ పడుతున్నప్పటికీ చంద్రబాబు మొగ్గు మాత్రం క్లియర్ గానే ఉన్నట్లు సమాచారం.

 

వచ్చే నెలలో నాలుగురాష్ట్రాల గవర్నర్ల పేర్లను కేంద్రం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇందులో తమిళనాడు గవర్నర్ బీఎన్ రవిని మార్చే అవకాశం ఉంది. ఆయన స్ధానంలో అశోక్ గజపతిరాజుకు ఛాన్స్ దక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తమిళనాడు గవర్నర్ గా రోశయ్య వంటి వారు పనిచేశారు. ఇప్పుడు అశోక్ గజపతిరాజును తమిళనాడు గవర్నర్ గా నియమిస్తే తెలుగు రాష్ట్రాల వారికి అక్కడ మరో అవకాశం లభించినట్లే. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి లభిస్తే కెరీర్ చరమాంకంలో ఆయనతో పాటు టీడీపీకి కూడా గౌరవంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.


ఇది కూడా చదవండివిశాఖ మేయర్ పీఠంపై కూటమి తుది కసరత్తు..! లిస్టులో ఆ ముగ్గురు పేర్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #TDP #GovernorPost #PoliticalNews #BreakingNews #AndhraPolitics #TeluguPolitics