Header Banner

మళ్లీ జైలుకు చేరిన వైసీపీ నేత! రాత్రికి రాత్రే రాజమండ్రికి తరలింపు!

  Sat Apr 12, 2025 10:18        Politics

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో మాధవ్‌తో పాటు మరో ఐదుగురికి గుంటూరు కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వారందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌ సతీమణి భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, అతడిని స్టేషన్‌కు తీసుకెళ్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ తన అనుచరులతో కలిసి అడ్డగించి దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

 

ఈ ఘటనపై గోరంట్ల మాధవ్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిన్న గోరంట్ల మాధవ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు కానీ, "నేను మాజీ ఎంపినని మీడియా ముందు క్రిమినల్‌లా ఎలా ప్రవేశపెడతారు?" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగ్వాదం తర్వాత, మీడియా సమావేశాన్ని రద్దు చేసి వైద్య పరీక్షలు పూర్తిచేసి నేరుగా కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు మొదటగా రిమాండ్‌ను నెల్లూరు జైలుకు తరలించాలని ఆదేశించినా, అక్కడ సదుపాయాలు సరిగాలేవని పోలీసులు తెలపడంతో న్యాయమూర్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని మార్పు చేశారు. దీంతో గోరంట్ల మాధవ్‌తో పాటు మిగతా నిందితులను అర్ధరాత్రి జైలుకు తరలించారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #RajahmundryJail #GorantlaMadhavArrest #PoliticalTwists #YSRCPvsTDP #ChebroluKiranCase #AndhraPolitics #MidnightTransfer #CourtDrama #TDPvsYCP