Header Banner

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

  Tue Apr 08, 2025 12:03        APNRT

ప్రవాసాంధ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తను తెలిపింది. ఈ విషయాన్ని జీవో రూపంలో నిన్న రిలీజ్ చేసింది. ఎందరో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు పుట్టిన ఊరు, దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లి వారి మెరుగైన జీవితం కోసం అక్కడ పనిచేస్తుంటారు. వారికి ఇక్కడ అనగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు. ఆస్తి తగాదాలు, భార్యా భర్తల గొడవలు మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము. అదే ఎన్నారైలకు ఆ సమస్యలు ఎన్నో చిక్కులు తెచ్చిపెడతాయి. అందుకోసమే ఏపీ ఎన్ఆర్టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ) ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల సమస్యలకు సమర్థవంతంగా స్పందించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

 

ఇది కూడా చదవండి: పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..? 

 

ఈ ప్రత్యేక సెల్‌లు ప్రవాసాంధ్రుల అవసరాలు, ఫిర్యాదులు, సంక్షేమ కార్యక్రమాలు, సేవలపై సమగ్ర పరిష్కారాలను అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో అధికారులు, సంబంధిత విభాగాల సమన్వయంతో ఈ సెల్‌లు పనిచేస్తాయి. ప్రవాసాంధ్రుల అభ్యున్నతి, సంక్షేమం దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు మధ్య మరింత సులభమైన కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఈ సెల్‌ ద్వారా సేవల అందుబాటు పెరగడంతో పాటు, తక్షణ స్పందన, సమస్యల పరిష్కారంలో వేగం కూడా మెరుగవుతుంది. అలాగే వారికి మెరుగైన అవకాశాలు ఉండడంతో ఎన్నారైలు తమ స్వదేశంలో పెట్టుబడి పెట్టాలన్నా చాలా సులభతరం అవుతుంది. ఎన్నారైల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుంది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 లో ఏర్పాటు చేసిన ఏపీఎన్నార్టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారితో సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో ఎన్నారైలు కూడా భాగస్వాములు అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ సొసైటీ ద్వారా ప్రవాసుల సంక్షేమం, విదేశాలలో రాణించడానికి వారికి అవసమయ్యే నైపుణ్యాలలో శిక్షణ కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఎన్నారైల సమస్యలు కూడా డీజీపీ ఆఫీసులో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు తీసుకొని ఆ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరగడంతో ఎన్నారైలు పలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. వారి కోసం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల పలువురు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

 

చేసే సేవకు గుర్తింపు రావాల్సిన వయసులో.. డిప్యూటీ కలెక్టర్‌ మృతి దిగ్భ్రాంతికరం! మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి!

 

అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం! డిప్యూటీ కలెక్టర్ మృతి! చంద్రబాబు సంతాపం!

 

జగన్‌కు ఊహించని షాక్‌! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!

 

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలుఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #Andhrapradesh #APForNRTs #NRTSupport #PravasaAndhrulu #APNRTS #ChandrababuForNRTs #NRIHelpDesk