Header Banner

మూడో విడత నామినేటెడ్‌ పోస్టులు ఖరారు.. ఆశావాకుల ఆసక్తి! ఆ రోజున జాబితా విడుదల!

  Tue Mar 25, 2025 07:53        Politics

ఉగాది (Ugadi) రోజున మూడో విడత (Third Phase) నామినేటెడ్ పదవుల (Nominated Positions) జాబితా విడుదల చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ (TDP) అధిష్టానం ప్రకటించింది. 50 నుంచి 60 ఏఎంసీలు జాబితా తుది కసరత్తు చేస్తోంది. త్వరలో 60 కీలక కార్పొరేషన్లు, 21 ఆలయ కమిటీల నియామకాలు చేపట్టనుంది. మహానాడు కల్ల అన్ని పదవులు భర్తీ చేయనుంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి పెద్ద సంఖ్యల ఆశావాహులు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానానికి 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా జనసేన,బీజేపీలు మరిన్ని పోస్టులు అడుగుతున్నారు.


ఇది కూడా చదవండి: ఏపీలో నామినేటెడ్ పదవుల మూడో దఫా జాబితా సిద్ధం! కీలక పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు! సీఎం వద్దకు ఫైనల్ లిస్టు!


ఉగాది నాడు మూడో కోటా జాబితా విడుదల
నామినేటెడ్‌ పదవుల భర్తీ కోసం టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 30న ఉగాది పర్వదినాన మూడో విడత జాబితా విడుదల చేయాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ సారికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల భర్తీకే పరిమితం కావాలని భావిస్తుండడంతో కీలకమైన కార్పొరేషన్లను ఆశిస్తున్న ఆశావహులకు నిరాశేనని చెప్పవచ్చు. అయితే మహానాడుకల్లా అన్ని నామినేటెడ్‌ పదవులూ భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన దరిమిలా రెండు నెలల్లోనే వారి ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక.. గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబరులో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు న్యాయం చేశారు. మూడో విడత నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై నాలుగు నెలలుగా కసరత్తు జరుగుతున్నా సామాజిక సమీకరణలు.. కూటమి పార్టీల డిమాండ్ల నేపథ్యంలో ఓ కొలిక్కి రావడం లేదు. ఎట్టకేలకు ఏఎంసీ చైర్మన్లతో మూడో విడత జాబితాకు తుదిరూపు ఇస్తున్నారు. రాష్ట్రంలో 218 మార్కెట్‌ కమిటీలు ఉండగా ఈ విడతలో 50 నుంచి 60 స్థానాలే భర్తీ చేయనున్నారు. మిగిలినవాటిని మే నెలలో భర్తీ చేయాలనుకుంటున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


60 వేల పైచిలుకు దరఖాస్తులు
నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ఒక్క టీడీపీ నుంచే 60వేల పైచిలుకు దరఖాస్తులు అందాయి. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారైనా కుటుంబ సాధికార సారథి (కేఎస్ఎస్) బాధ్యత చేపట్టాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఆశావహులు చాలామంది ఇప్పటికే ఆ బాధ్యతలు చేపట్టారు. నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, గన్ని వీరాంజనేయులు, పరసా రత్నం, దారపనేని నరేంద్ర, కనపర్తి శ్రీనివాసరావు, నాదెండ్ల బ్రహ్మం, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు. ప్రభాకర్‌ చౌదరి, గన్ని వీరాంజనేయులు సీట్ల సర్దుబాటులో టికెట్లు కోల్పోయారు. దారపనేని నరేంద్ర వైసీపీ హయాంలో అక్రమ కేసుల బాధితుడు. వీరితోపాటు ఇటీవల ఎమ్మెల్సీ ఆశించి నిరాశపడినవారు కూడా కీలకమైన నామినేటెడ్‌ పోస్టులు అడుగుతున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత.. ఉగాది నుంచి P4.!

 

వైసీపీ బిగ్‌షాక్.. బోరుగడ్డకు బిగుస్తున్న ఉచ్చు.! మరో కేసులో.. అప్పటి నుంచి జైల్లోనే.!

 

BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!

 

తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..

 

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్బాలయ్యగోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

 

అమెరికాలో మరో దారుణ ఘ‌ట‌న‌.. భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను తుపాకీతో కాల్చి చంపిన దుండ‌గుడు!

 

వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు - ఏ-1గా మాజీ మంత్రి.! పోలీస్ రంగం సిద్దం - ఈ కేసులో మరో కీలక అంశం!

 

వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! పింఛన్ లో కొత్త మలుపు..

 

టీటీడీ కీలక అప్డేట్.. ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

 

గుడ్‌న్యూస్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆ దేశానికి డైరెక్ట్‌ ఫ్లైట్‌! వారానికి రెండుసార్లు ఈ విమాన సర్వీసు.!

 

విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...

 

ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్! ఇలా చేయండిలేకపోతే పథకాలు రావుసరుకులు కట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #nominated #post #list #released #todaynews #flashnews #latestnews