Header Banner

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. కొత్త అవకాశాలు వస్తాయి అన్న అమెరికా! ఇక వారికి పండగే పండగ..

  Thu Apr 24, 2025 15:26        India, U S A

భారత్ సుంకాలు తగ్గిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యానించారు. కొన్ని రకాల వస్తువులపై భారత్ సుంకాలు తగ్గించనుందనే విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఓవల్ ఆఫీస్లో పాత్రికేయులతో ఈమేరకు మాట్లాడారు. అయితే ఏ ఉత్పత్తులపై తగ్గింపు ఉంటుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు (India-USA). ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పై భారత్, అమెరికా అధికారులు ఈనెల 23న వాషింగ్టన్లో చర్చలు ప్రారంభించారు. భారత్తో ఒప్పందం వల్ల అమెరికా వస్తువులకు కొత్త మార్కెట్లు తెరచుకుంటాయని, ఇరు దేశాల్లోని ఉద్యోగులు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయని ఇప్పటికే అమెరికా పేర్కొంది.

 

ఇది కూడా చదవండి: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. వీసా రద్దుపై కోర్టు కీలక ప్రకటన! 50 శాతం మంది భారతీయులే..

 

టారిఫ్, టారిఫేతర అడ్డంకులను అమెరికా తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ పేర్కొన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన షరతుల(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్)కు ఇరు దేశాలు తుదిరూపునిచ్చాయి కూడా. 90 రోజుల పాటు టారిఫ్ అమలుకు అమెరికా విరామం ప్రకటించిన నేపథ్యంలో ఈ మూడు రోజుల చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ తరపు బృందానికి వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నవేళ భారత్ మాత్రం విభిన్నంగా ఆలోచించి.. ప్రతి సుంకాలకు బదులుగా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టిసారించింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడిన సంగతి తెలిసిందే. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే చర్చలు జరుగుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

 

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

 

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!

 

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #Indian #Gold #AmericaWomen #Fakejewellery #Rajasthanica