Header Banner

తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత! మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో..!

  Tue Feb 18, 2025 12:41        Politics

కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అక్కడికి చేరుకున్న వైకాపా కౌన్సిలర్లను తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో వారు వెనుదిరిగి మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంటికి వెళ్లారు. సోమవారం కోరం లేకపోవడంతో వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో నేడు మరోసారి నిర్వహించనున్నారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అక్కడికి చేరుకున్నారు. తెదేపా శ్రేణులు భారీగా తరలి రావడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వైకాపా కౌన్సిలర్లను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కిడ్నాప్ చేశారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.


ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే! 


కౌన్సిలర్లకు స్వేచ్చగా ఓటు వేసే అవకాశం లేదన్నారు. వైకాపా కౌన్సిలర్లలో ఎక్కువ మంది తమకే మద్దతిస్తారని చెబుతున్నారు. మరోవైపు 'చలో తుని'కి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని హెచ్చరించారు. తుని మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163 (2) అమలు చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో అనుచరులతో కారులో తుని వెళ్తున్న వైకాపా నేత ముద్రగడ పద్మనాభరెడ్డి, మాజీ ఎంపీ వంగా గీతను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #kakinada #thuni #muncipalkaryalam #todaynews #flashnews #latestupdate