Header Banner

యాంకర్ విష్ణు ప్రియ అరెస్ట్..? ఎందుకో తెలుసా? వాస్తవానికి ఈ కేసులో..

  Thu Mar 20, 2025 11:18        Entertainment

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన అడ్వొకేట్ తో కలిసి ఉదయం పది గంటల ప్రాంతంలో స్టేషన్ కు వెళ్లారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా.. షూటింగ్ కారణంగా విష్ణుప్రియ ఆ రోజు గైర్హాజరయ్యారు. తన తరఫున శేఖర్ భాషాను పోలీస్ స్టేషన్ కు పంపించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ల కారణంగా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎంతోమంది అప్పుల ఊబిలో చిక్కుకుని దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఈ యాప్స్ కు సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ప్రమోషన్ చేయడంపై ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. సజ్జనార్ ట్వీట్లతో ఏపీ, తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. తాజాగా 11 మంది ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు.. విచారణకు రమ్మంటూ వారికి నోటీసులు పంపించారు. ఇందులో యాంకర్లు విష్ణుప్రియ, శ్యామలతో పాటు పలువురు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నారు.

 

ఇది కూడా చదవండి: షాక్ షాక్.. నా రాజీనామా కి కారణం ఆమెనే.. ఇదే ఫైనల్ అన్న రాజశేఖర్! ఈయన బాటలో మరికొందరు ఎమ్మెల్సీలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేబినెట్ ర్యాంకుతో.. కీలక నిర్ణయం! ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా ఆమె పేరు ఫిక్స్!

 

మాజీ మంత్రికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్! అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా..

 

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్! మండలిలో మాటల యుద్ధం! దమ్ముంటే ఈ డేటాను ఇవ్వండి..

 

జగన్ కి షాక్‌ల మీద షాక్‌లు.. వైసీపీలో గందరగోళం.. మరో కీలక నేత రాజీనామా!

 

అయ్యయ్యో.. ఏపీ ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు... గాయపడిన ఎమ్మెల్యే.!

 

వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ! రేపు కూటమిలో చేరబోతున్న వైసీపీ కార్పొరేటర్లు ....

 

ఏపీలో భానుడి ప్రతాపం ! తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! ఆస్పత్రుల్లో డీహైడ్రేషన్ కేసులు...

 

 

ఇండియాలో 5 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఏదో తెలుసా.? అసలు ఊహించి ఉండరు!

 

పోసాని పొలిటికల్ స్క్రిప్ట్! డైలాగ్ రైటర్ నుండి రిమాండ్ రైటర్ వరకు...

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Vishnupriya #BettingApps #Promotion #TelanganaPolice #SocialMedia