Header Banner

స్మార్ట్ రైడింగ్ కోసం బెస్ట్ చాయిస్! టీవీఎస్ జూపిటర్ 125! సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్!

  Mon Mar 17, 2025 11:49        Business

టీవీఎస్ కంపెనీ మరో సరికొత్త స్టైలిష్ స్కూటీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. టీవీఎస్ జూపిటర్ 125 స్మార్ట్ఎక్సోనెక్ట్ పేరుతో వచ్చిన ఈ స్కూటీ, ఆధునిక ఫీచర్లతో టెక్నాలజీ ప్రియులను ఆకర్షిస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్, వాయిస్ అసిస్ట్, కాల్ & టెక్ట్స్ అలర్ట్స్, క్రికెట్ స్కోర్ అప్‌డేట్ వంటి 60కి పైగా స్మార్ట్ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. 124.8 CC సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో ఈ స్కూటర్ శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. లీటర్ పెట్రోల్‌తో 57.27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

 

ఈ స్కూటీలో డిజిటల్ బ్లూటూత్ క్లస్టర్, మొబైల్ చార్జింగ్ పాయింట్, డిస్టాన్స్ టు ఎంప్టీ ఆప్షన్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. 5.1 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 33 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్, స్టైలిష్ టెయిల్ ల్యాంప్ దీని ప్రత్యేకతలు. ప్రయాణంలో న్యూస్, వెదర్ అప్‌డేట్స్, క్రికెట్ స్కోర్ లాంటి సమాచారం తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఫ్రంట్ లెగ్ స్పేస్ కూడా ఎక్కువగా ఇచ్చారు, దీంతో కంఫర్ట్‌గా ప్రయాణించొచ్చు. అలాగే, రోడ్డుపై స్టబిలిటీ కోసం బాడీ బ్యాలెన్స్ ఫీచర్ అందించారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ! 60 వేల దరఖాస్తుల పరిశీలన! కొనసాగుతున్న కసరత్తు!

 

సేఫ్టీ పరంగా చూస్తే, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనక డ్రమ్ బ్రేక్, ట్యూబ్‌లెస్ టైర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ ఎలెగాంట్ రెడ్, మాటే కాపర్ బ్రాంజ్ కలర్స్‌లో లభిస్తుంది. దాని ఎక్స్-షోరూమ్ ధర రూ.79,540 కాగా, HDFC క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,500 డిస్కౌంట్, అలాగే ఇతర ఆఫర్లతో రూ.10,000 వరకు సేవింగ్ చేసే అవకాశం ఉంది. 5.55% వడ్డీతో EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన సమాచారం కంపెనీ బ్రోచర్ ఆధారంగా ఇవ్వబడింది. స్కూటర్ కొనుగోలుపై నిర్ణయం తీసుకునే ముందు టీవీఎస్ అధికారిక డీలర్లను సంప్రదించి పూర్తి సమాచారం పొందడం మంచిది.

 


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు కలకలం.. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా.!

 

నేటితో గొడ్డలి వేటుకు ఏళ్లు! కీలక సాక్షులు అనుమానాస్పద మృతి! బయటకు రానున్న నిజాలు!

 

 రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!

 

 గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TVSJupiter125 #SmartXonnect #TVSScooter #SmartRiding #BluetoothConnectivity #HighMileage #StylishScooter #TechLoaded #CityRider #BikeLover