Header Banner

పెన్షన్ దారులకు ఒకేసారి రెండు గుడ్ న్యూస్ లు! నేటి నుండి వారికి అకౌంట్ లో డబ్బులు జమ!

  Tue Apr 01, 2025 06:59        Politics

ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి దివ్యాంగ విద్యార్థులకు పింఛన్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానాన్ని అమలు చేయనుంది. ఈ నిర్ణయం లక్షల మంది దివ్యాంగ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ఇప్పటి వరకు పింఛన్ కోసం విద్యార్థులు సొంత ఊరికి వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. దీనికి సంబంధించిన దరఖాస్తు కోసం విద్యార్థులు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో స్టడీ సర్టిఫికేట్, బ్యాంకు ఖాతా వివరాలు, పింఛన్ ఐడీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమర్పించాలి. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ద్వారా ఈ దరఖాస్తులను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపిస్తారు. డీబీటీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతినెలా పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.

 

ఇది కూడా చదవండిమరో నామినేటెడ్ పోస్టుల లిస్ట్ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ! పదవులు మాత్రం వారికే!

 

పింఛన్ల పంపిణీలో అవకతవకలు నివారించేందుకు ప్రభుత్వం అధునాతన ఎల్-1 ఆర్డీ స్కానర్లను అందుబాటులోకి తెచ్చింది. పాత ఎల్-జీరో ఆర్డీ స్కానర్ల సమస్యలతో వృద్ధులు, చేతివృత్తిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో, ఈ కొత్త ఎల్-1 ఆర్డీ స్కానర్లు యూఐడీఏఐ ఆధార్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేయబడ్డాయి. వీటివల్ల వేలిముద్రలను సున్నితంగా స్కాన్ చేయడం, గీతలు లేదా తేమ ఉన్నా స్పష్టత ఇవ్వడం సులభం అవుతుంది. దేశవ్యాప్తంగా నకిలీ వేలిముద్రల సమస్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పరికరాలను ఉపయోగించాలని సూచించగా, ఏపీ ప్రభుత్వం కూడా సచివాలయాలకు ఈ పరికరాలను పంపిణీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులతో దివ్యాంగుల పింఛన్ల పంపిణీ మరింత సులభం, పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త మార్పులు! రేపటి నుండి అమలు... తప్పకుండా తెలుసుకోండి!

 

వైసీపీకి మరో షాకింగ్ న్యూస్! కీలక నేత రాజీనామా.. బీజేపీలోకి ఎంట్రీ!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

 

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #APPensionScheme #GoodNewsForPensioners #APRilSpecial #DoubleBenefits #PensionUpdates #APGovtSchemes