Header Banner

జగన్‌కు ఊహించని షాక్‌! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!

  Mon Apr 07, 2025 08:43        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన పలు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా, తాజాగా విశాఖపట్నం కి చెందిన మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పడం జగన్ కు ఊహించని షాక్ అనే చెప్పాలి.

వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విశాఖపట్నం కి చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకటరావు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. నిన్న రాత్రి తన రాజీనామా పైన ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన రాజీనామా లేఖను వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్టు పేర్కొన్నారు.

విశాఖలో వైసీపీకి షాక్
అయితే త్వరలోనే ఆయన ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపైన ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన సీనియర్ నేత అయిన చొక్కాకుల వెంకటరావు ప్రస్తుతం పార్టీని వీడటం విశాఖలో పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. చొక్కాకుల వెంకటరావు వైఎస్ఆర్సిపి స్థాపించిన వెంటనే పార్టీలో చేరారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!


వైసీపీలో కీలకంగా పని చేసిన చొక్కాకుల
2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చొక్కాకుల ఓటమిపాలయ్యారు. అప్పుడు బిజెపి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం బిజెపిలో చేరారు.

జగన్ పాలనలో వీకేపీసీపీసీఐఆర్‌యూడీఏ చైర్మన్ గా అవకాశం
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన ఆయన బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకట్రావు భార్య లక్ష్మికి విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా జగన్ అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత చొక్కాకుల కూడా అదే సంస్థకు చైర్మన్ గా పనిచేశారు.

బీజేపీలో చేరతారా? మరే ఇతర పార్టీలోకి వెళ్తారా?
ప్రస్తుతం గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో యాక్టివ్ గా పని చేయడం లేదు. చొక్కాకుల వెంకటరావు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. గతంలో ఆయన బిజెపిలో పనిచేయడంతో మళ్లీ ఆయన బిజెపి తీర్థం పుచ్చుకుంటారా లేదా కూటమిలోని మరే ఇతర పార్టీలోకి వెళతారా అన్నది కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #JaganShock #YSRCPExit #PoliticalTwist #AndhraPolitics #SeniorLeaderResigns