Header Banner

కిషన్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి ప్రెస్ మీట్! చంద్రబాబు సూచన మేరకే నడుచుకుంటున్నా!

  Sun Mar 02, 2025 16:56        Politics

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేడు హైదరాబాద్ లోని కవాడిగూడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... తాను కేంద్ర మంత్రి అయ్యాక చంద్రబాబు ఓ సూచన చేశారని... నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే పనిచేయకుండా, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ది కోసం పనిచేయాలి అని గైడెన్స్ ఇచ్చారని వెల్లడించారు. ఏపీ విమానయాన రంగం అభివృద్ధికి ఎంత కృషి చేస్తావో, తెలంగాణ విమానయాన రంగం అభివృద్ధి కోసం కూడా అంతే పాటుపడాలి అని చెప్పారు అని వివరించారు. కేంద్రమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న కిషన్ రెడ్డి కూడా తనకు మార్గదర్శిగా నిలిచారని, పెద్దల అనుభవాన్ని ఆసరాగా చేసుకుని తాను ముందుకు పోతున్నానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. తాజాగా, వరంగల్ ఎయిర్ పోర్టుకు తన హయాంలోనే క్లియరెన్స్ రావడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. 

 

ఇది కూడా చదవండి: పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!

 

వరంగల్ ఎయిర్ పోర్టు గతంలో ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయంగా ఉండేదని అన్నారు. 1981 వరకు వరంగల్ ఎయిర్ పోర్టులో ఏదో ఒక కార్యకలాపం జరుగుతూనే ఉండేదని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశ విమానయాన రంగంలో ఓ విప్లవం మొదలైందని అన్నారు. గత పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 79 నుంచి 150కి పెరిగిందని చెప్పారు. చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటు చేశామని, ఇవాళ వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు క్లియరెన్స్ శుభవార్తను మీతో పంచుకోవడం సంతోషదాయకమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మామునూరు విమానాశ్రయం క్లియరెన్స్ ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని తెలిపారు. వరంగల్ వంటి పెద్ద  నగరంలో ఎయిర్ పోర్టు విషయంలో గతంలో అడుగులు ముందుకు పడలేదని, ఇప్పుడది నెరవేరిందని అన్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #KinjarapuRam #MohanNaidu #Warangal #Airport #CivilAviation #Telangana #AndhraPradesh