Header Banner

అమెరికా-చైనా సుంకాల యుద్ధం! భారత మార్కెట్‌పై దృష్టిసారించిన చైనా! ఇంకా ఆ వస్తువులకు ధరలు తగ్గుదల!

  Sat Apr 19, 2025 09:22        India

డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా ఆర్ధిక విధానాల కారణంగా చైనా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా చైనా నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకాలను 125%కి పెంచిన నేపథ్యంలో, చైనా కంపెనీలకు అమెరికన్ మార్కెట్ లాభదాయకంగా లేకుండా పోయింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, స్మార్ట్‌ఫోన్లు, లిథియం-అయాన్ బ్యాటరీలు, ఆటోమోటివ్ అసేసోరీస్ వంటి ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసే చైనా, ఇప్పుడు భారతదేశంలాంటి ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించింది. ఈ కారణంగా చైనా కంపెనీలు భారతీయ తయారీదారులకు డిస్కౌంట్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. 5% వరకు తగ్గింపుతో కూడిన ఈ డిస్కౌంట్లు భారతదేశానికి ఆదాయంగా మారే అవకాశముంది. దీనివల్ల ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తక్కువవుతాయని, వినియోగదారులకు లాభం జరుగుతుందని భావిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా, అమెరికా-చైనా మధ్య ఉన్న ఈ సుంకాల యుద్ధం గ్లోబల్ ఎకానమీపై ప్రభావం చూపుతోంది. అమెరికా తాత్కాలికంగా 90 రోజుల పాటు కొత్త సుంకాలను నిలిపివేసినప్పటికీ, చైనాకు మాత్రం ఎలాంటి రిలీఫ్ లభించలేదు. మరోవైపు ట్రంప్ సుంకాల విధానాలపై అమెరికాలోని వ్యాపార దిగ్గజాలు, పెట్టుబడిదారులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం చైనాపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, చైనా ఇతర దేశాల్ని దోచుకుంటోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజా నిర్ణయాల వల్ల అమెరికన్ మార్కెట్లు భారీ లాభాలు పొందినప్పటికీ, చైనా మాత్రం తన ఉత్పత్తులకు కొత్త మార్కెట్ల కోసం భారతదేశంలాంటి దేశాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఇది భారత్‌కి ఒక గొప్ప అవకాశంగా మారనుంది.

 

 

ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #TradeWar #USChinaTensions #TrumpTariffs #ChinaCrisis #IndiaOpportunity #MakeInIndia