Header Banner

భారత్‌పై అమెరికా పన్నుల మోత... కేంద్రం వ్యూహాత్మక చర్చలు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

  Thu Mar 06, 2025 17:14        Politics

భారత్‌పై అమెరికా సుంకాల మోతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్పందించారు. సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లారని తెలిపారు. అమెరికా వాణిజ్య మంత్రులతో ఆయన చర్చలు జరుపుతున్నారని చెప్పారు. భారత్ ఎగుమతుల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చలు ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్లు, వ్యాపార సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని బడ్జెట్లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక వేత్తలు, వివిధ వర్గాల మేధావులతో కేంద్ర బడ్జెట్పై విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


అనంతరం మీడియాతో మాట్లాడారు. “ఏటా బడ్జెట్ టేబుల్ చేశాక మధ్యలో గడువు ఉంటుంది. మళ్లీ పార్లమెంట్ మొదలయ్యాక ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఆమోదం ఉంటుంది. ముఖ్యమైన అభిప్రాయాలు, సూచనలొస్తే సవరణలు చేసి బడ్జెట్ను ఆమోదిస్తాం. ప్రభుత్వ ఖర్చులతో రోడ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నాం. జలీవన్ మిషన్ ద్వారా ఒక్కో ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. మనం ఉపయోగించుకున్న వాటికే పన్ను చెల్లిస్తాం. కారు కొంటే దానిపైనే పన్ను చెల్లిస్తాం.. కొనని వారు చెల్లించరు. రోడ్డు వినియోగించుకున్న వారే టోల్ ట్యాక్స్ చెల్లిస్తారు. ప్రజలు పన్నులు చెల్లిస్తేనే రహదారులు నిర్మించగలిగేది" అని ఆర్థిక మంత్రి వివరించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #nirmalasitaraman #unionminister #todaynews #flashnews #latestnews