Header Banner

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

  Wed Feb 12, 2025 09:52        Politics

ఏ మద్యం బాటిల్పై అయినా ప్రభుత్వం పెంచింది రూ.10 మాత్రమేనని, 5 రెట్లు, 10 రెట్లు ధరను పెంచినట్లు వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఏఆర్టీ సర్దుబాటులో భాగంగానే ధరలు పెంచామని, ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని వెల్లడించారు. మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, అసత్య ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సచివాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. 'వైకాపా హయాంలో మద్యం విధానాన్ని భ్రష్టు పట్టించారు.


ఇది కూడా చదవండి: ఇలాంటి నీచమైన పనులు వైసీపీకి తప్ప మరెవరికి చేతకాదు! ఊరినే తాకట్టుపెట్టిన వైకాపా నేత.. వెలుగులోకి మరిన్ని నిజాలు! 


సొంత ఆదాయాలను పెంచుకోవడానికి మద్యం బాటిల్ ధరను ఏకంగా రూ.200కి పెంచారు. చెత్త బ్రాండ్లను తెచ్చారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని సొంత మనుషులతో విక్రయించారు. ఇప్పుడు వీటన్నింటినీ అరికట్టాం. రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తున్నాం' అని తెలిపారు. త్వరలోనే విజిలెన్స్ నివేదిక.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయిందని, త్వరలోనే నివేదికను బయట పెడతామని మంత్రి వెల్లడించారు. 'అక్రమాల్లో కింది స్థాయి నుంచి స్థాయి వరకు అందరి ప్రమేయమున్నట్లు తేలింది. త్వరలో వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే వైకాపా నేతలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు' అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఎస్క్రో కింద 10 డిపోలను తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారని, వాటిని ఇప్పుడు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏడాదిలో 'సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో వచ్చే వారంలో నవోదయం కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #wines #fakenews #todaynews #flashnews #latestupdate