Header Banner

విజయశాంతి భర్తను రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా.. సోషల్ మీడియాలో ప్రమోషన్.!

  Sat Apr 12, 2025 11:12        Politics

కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విజయశాంతి భర్త ఎంవీ శ్రీనివాస ప్రసాద్‌కు నాలుగేళ్ల క్రితం ఎం.చంద్రకిరణ్‌రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పడంతో పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని శ్రీనివాస ప్రసాద్ హామీ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అనుకున్న ఫలితాలు రాకపోవడంతో చంద్రకిరణ్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశారు. అయితే, చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతి వద్ద పనిచేస్తున్నానని చెప్పి పలువురు రాజకీయ నాయకుల వద్ద కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో తనకు డబ్బులు ఎప్పుడు ఇస్తావని శ్రీనివాస ప్రసాద్‌కు నిందితుడు మెసేజ్ పెట్టాడు. ఒప్పందం జరగకున్నా డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన విజయశాంతి భర్త.. ఇంటికి వచ్చి మాట్లాడాలని సూచించారు. ఇంటికి రాలేదు సరికదా.. తనకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులను రోడ్డున పడేస్తానని, కసి తీరేవరకు దారుణంగా చంపుతానని బెదిరిస్తూ మెసేజ్ పెట్టాడు. దీంతో శ్రీనివాస ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Vijayashanti #KolkataDoctorRapeIncident #Telangana