Header Banner

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

  Thu Apr 03, 2025 10:11        Politics, అమరావతి - The Capital

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో ప్రపంచ బ్యాంకు శుభవార్త అందించింది. రాజధాని అమరావతి నిర్మాణాల కోసం ఇదివరకే ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్లు మంజూరు చేయగా, ఇందులో మొదటి విడత రుణంగా రూ.3,535 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు ఈ రోజు (గురువారం) రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. దీనితో అమరావతి నిర్మాణంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడినట్టయింది. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలోనే ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏడీబీ రూ.6,700 కోట్ల రుణం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల నుండి రూ.13,600 కోట్లు రుణం రూపంలో అందుతుండగా, అదనంగా రూ.1,400 కోట్లు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయంగా అందిస్తోంది.

 

ఇది కూడా చదవండి: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

మరోవైపు హడ్కో నుండి రూ.11 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి అందింది. అంతేకాకుండా, జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరొక రూ.5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలు గత డిసెంబర్ నెలలోనే ఆమోదం పొందాయి. ఆ క్రమంలో ఈ సంవత్సరం జనవరిలోనే బ్యాంకుల నుంచి మొదటి విడత నిధులు రావాల్సి ఉంది. అయితే అమరావతి రాజధానిగా పనికిరాదని, రుణం ఇవ్వవద్దంటూ కొందరు ఆ బ్యాంకులకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాల నేపథ్యంలో వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలలు ఆలస్యమైంది. చివరికి మొదటి విడత నిధులు విడుదల కావడంతో అమరావతి రాజధాని పనులు వేగవంతం అయ్యేందుకు మార్గం సుగమం అయింది. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Amaravati #WorldBank #Funds #REleased #Chandrababu #Government