Header Banner

వైసీపీకి ఊహించని షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా..?

  Tue Mar 25, 2025 10:58        Politics

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తూ కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో జరిగిన అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలకు సంబంధించిన కేసులో కాకాణిని ఏ4గా చేర్చినట్లు సమాచారం. రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. మైనింగ్ లోడ్లతో రవాణాకు సిద్ధమైన 40 లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ అక్రమ మైనింగ్ వెనుక అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి.

 

ఇది కూడా చదవండి: పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త! ఇకపై పింఛన్ కోసం స్వగ్రామం వెళ్లనక్కర్లేదు!

 

వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్‌పై చర్యలు లేకపోవడంతో కేంద్ర మైనింగ్ శాఖకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ అక్రమ క్వారీయింగ్ కేసులో కదలిక మొదలైంది. తొలుత ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరులైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలపై కేసు నమోదు చేయగా, వీరు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. తాజాగా సోమవారం ఈ కేసులో కాకాణితో సహా మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఏ6, 8గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని గూడూరు కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాలతో జైలుకు తరలించారు. ఒకవైపు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగంట శ్రీనివాసులు రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించడం, మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా చేర్చడంతో కాకాణి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని భావిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: మూడో విడత నామినేటెడ్‌ పోస్టులు ఖరారు.. ఆశావాకుల ఆసక్తి! ఆ రోజున జాబితా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత.. ఉగాది నుంచి P4.!

 

వైసీపీ బిగ్‌షాక్.. బోరుగడ్డకు బిగుస్తున్న ఉచ్చు.! మరో కేసులో.. అప్పటి నుంచి జైల్లోనే.!

 

BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!

 

తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..

 

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్, బాలయ్య, గోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

 

అమెరికాలో మరో దారుణ ఘ‌ట‌న‌.. భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను తుపాకీతో కాల్చి చంపిన దుండ‌గుడు!

 

వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు - ఏ-1గా మాజీ మంత్రి.! పోలీస్ రంగం సిద్దం - ఈ కేసులో మరో కీలక అంశం!

 

వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! పింఛన్ లో కొత్త మలుపు..

 

టీటీడీ కీలక అప్డేట్.. ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

 

గుడ్‌న్యూస్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆ దేశానికి డైరెక్ట్‌ ఫ్లైట్‌! వారానికి రెండుసార్లు ఈ విమాన సర్వీసు.!

 

విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...

 

ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్! ఇలా చేయండి, లేకపోతే పథకాలు రావు, సరుకులు కట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #YCP #AndhraPradesh #APpolitics #APNews #EC