ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా...
Sat Apr 11, 2020 14:52 U S A, Rachanalu (రచనలు)అమ్మాయ్ ఎన్ని డబ్బులు తెచ్చుకున్నావని అడిగితే 200ల డాలర్లు తెచ్చుకున్నానన్నయ్యా అన్నాను. సరిపోతాయిలే అమ్మాయ్ అంటే సరిపోతాయన్నయ్యా అన్నాను. తర్వాత రెండు రోజులకి అన్నయ్య పారాడైమ్ కంపెనీ గెస్ట్ హౌస్ కి తీసుకు వెళుతూ దారిలో షాప్ కి తీసుకువెళ్ళి తినడానికి, వండుకోవడానికి కావాల్సిన సరుకులన్నీ కొనిపెట్టి గెస్ట్ హౌస్ లో దించి అమ్మాయ్ అమెరికాలో నీ కొత్త కాపురం మెుదలయ్యింది అని నవ్వుతూ...
అయ్యెా అన్నీ కొన్నాం కాని బియ్యం మర్చిపోయామన్నాడు. కంపెనీ అతను నాకు పేరు గుర్తు లేదు తనకి అన్నయ్య చెప్పాడు బియ్యం తెచ్చి ఇవ్వమని. వాళ్ళతో కూడా నా గురించి జాగ్రత్తలు చెప్పి, అవసరమైతే ఫోన్ చేయమని చెప్పి వెళ్ళాడు. రెండు రోజులలో మరొకామె వస్తారు గెస్ట్ హౌస్ కి, భయం లేదని చెప్పి, రేపు బియ్యం తెచ్చిస్తానని చెప్పి అతను వెళుతూ, తలుపు ఎవరు కొట్టినా వెంటనే తీయకండి, కీ హోల్ నుండి చూసి, విషయం అడిగి తీయండి. అయినా ఎవరైనా వచ్చేముందు మేము మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పి వెళిపోయాడు.
మెుదటిరోజు ఒంటరిగా అమెరికా జీవితం మెుదలయ్యింది. రూమ్ లో బెడ్ ఉంది పరుపుతో సహా. నేను తెచ్చుకున్న దుప్పటి, దిండు కవర్ వేసుకున్నా. ఏమీ తినబుద్ది కాలేదు. గెస్ట్ హౌస్ లో లాండ్ ఫోన్, డెస్క్ టాప్ కంప్యూటర్ ఉన్నాయి. రూమ్ లో పడుకున్నా. ఎందుకో చాలా భయం వేసింది. ఎటు నుండి ఎవరు వస్తారో అని. అస్సలు ఇక రాత్రంతా నిద్ర పోలేదు. మరుసటి రోజు నిన్నటి అతనే బాసుమతి బియ్యం బాగ్ తెచ్చిచ్చాడు. 20 డాలర్లు అన్నాడు. అలా నేను ఇండియా నుండి తీసుకువెళ్ళిన 200 డాలర్లలో 20 డాలర్లు మొదటి ఖర్చన్న మాట. గెస్ట్ హౌస్ లో రెండోరోజు నుండి హాల్లో సోఫాలో పడుకోవడం,
కిటికీ గ్లాస్ కి ఉన్న బ్లైండ్స్ కొద్దిగా ఓపెన్ చేసి బయటకి చూడటంతోనే సరిపోయేది రాత్రంతా. పొద్దున్నే ఎండ చూడగానే భలే సంతోషం వేసేది. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు ఏదో ఎప్పుడో దూరమైన నేస్తం దొరికినట్లుగా. ఆ ఎండ చూసి బయటకి వెళ్ళాలనిపించేది. వెళితే చలి బాగా వేసి ఉండలేకపోయేదాన్ని. ఏదో వండుకోవడం, తినడం, చదువుకోవడం, మా కాలేజ్ మేట్స్, ఫ్రెండ్స్ ఫోన్లు చేయడంతో అలా కంపెనీ గెస్ట్ హౌస్ జీవితం గడుస్తోంది. ఈ లోపల ఒకావిడ గెస్ట్ హౌస్ కి వచ్చింది. హమ్మయ్య నాకు కంపెని దొరికింది అనుకున్నా. అంతలోనే వీకెండ్ వచ్చేసింది.
కాలేజ్ టైమ్ లో పెద్దగా మాట్లాడని సతీష్ రోజూ ఫోన్ చేస్తూ, నాకు హోమ్ సిక్ లేకుండా చేయడానికి చాలా ప్రయత్నించాడు. అమెరికాలో జాబ్స్ ఎలా ఉంటాయెా, ఎలా మాట్లాడాలో ఇలా అన్ని చెప్తుా ఉండేవాడు. నేనున్న బాల్టిమెార్ కి కాస్త దగ్గరలో ఉన్న కళ్యాణ్ కి ఫోన్ చేసి నన్ను వీకెండ్ వాళ్ళింటికి తీసుకువెళ్ళమని సతీష్ చెప్తే కళ్యాణ్, వాళ్ళావిడా వచ్చి వాళ్ళింటికి తీసుకువెళుతూ డ్రైవింగ్ కబుర్లు.. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు
బ్లైండ్ స్పాట్, లేన్స్ ఛేంజ్ అయ్యేటప్పుడు సిగ్నల్స్ వేయడము, స్పీడ్ లిమిట్స్ లాంటివి చెప్పాడు.
టన్నెల్ లోపల నుండి వెళ్ళేటప్పుడు పైన నీళ్ళుంటాయి, నీళ్ళలోనుండి సొరంగం ఇది అని చెప్తుంటే భలే ఆశ్చర్యంగా ఆ వింతలను,లైటింగ్ లను చూడటం నావంతైంది. కళ్యాణ్ మాట్లాడుతూ చూసావా మంజూ ప్రపంచం చాలా చిన్నది, మనల్ని ఇలా కలిపింది. అదే ఇండియాలో ఉంటే కలిసేవాళ్ళం కాదేమెానంటూ..మన క్లాస్ మేట్స్ ఫణి ఇంకా కొందరు వర్జీనియాలోనే ఉన్నారని చెప్తూ, కాలేజ్ కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురం కళ్యాణ్ వాళ్ళింటికి చేరాం. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు
మళ్ళీ కలుద్దాం.
గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.
మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or andhrapravasi@andhrapravasi.com
ముందు వారాల లింకులు
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4
రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...
alone-women-in-amerika-waiting-for-joining-job
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.