ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో...

Header Banner

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో...

  Sat May 16, 2020 16:28        U S A, Rachanalu (రచనలు)

రెనో లో ఫ్లైట్ దిగి, ఎయిర్ పోర్ట్ లో నుండే అబ్బు శ్రీనివాస్ కి కాల్ చేసాను. ఎలా రావాలని. కాబ్ మాట్లాడుకుని రమ్మని చెప్పారు. సరేనని ఎయిర్ పోర్ట్ బయటికి వచ్చి కాబ్ లో కార్సన్ సిటి బయలుదేరాను. నవేడా స్టేట్ కాపిటల్ కార్సన్ సిటీ. అమెరికాలో స్టేట్ కాపిటల్స్ ఎక్కువగా చిన్న చిన్న ఊర్లే ఉంటాయి. కార్సన్ సిటి మెుత్తం ఎటునుండి ఎటు తిరిగినా 2, 3 మైళ్ళ కన్నా ఎక్కువ ఉండదు.

అబ్బు ఉండే మొటల్ దగ్గరకి వెళ్ళేసరికి అబ్బు, సంపత్ ఇద్దరు సంపత్ జీప్ వేసుకుని వచ్చారు. లగేజ్ అబ్బు రూమ్ లో పెట్టి ఆఫీస్ కి వెళ్ళాము ముగ్గురము.  లోపలికి వెళ్ళాక వీళ్ళు నేను వచ్చానని చెప్పగానే, కాసేపటికి మైక్ వచ్చి లోపలికి తీసుకువెళ్ళి, డ్రింక్ ఏమైనా  కావాలా అని అడిగితే వాటర్ కావాలన్నాను. బాటిల్ తెచ్చి ఇచ్చాడు. మానేజర్ ఈరోజు రాలేదు రేపు వస్తాడు, వర్క్ ఎలాట్ చేస్తాడని చెప్పి, నాకు మిగతావాళ్ళ దగ్గర సిస్టమ్, సీట్ చూపించాడు. వాళ్ళందరు వర్క్ చేసుకుంటునే నాతో మాట్లాడం, అలా లంచ్ టైమ్ వచ్చేసింది.

అబ్బు, సంపత్ రోజూ సంపత్ ఇంట్లోనే లంచ్ చేస్తారు. మరో శ్రీనివాస్, శ్యామ్ వాళ్ళిళ్ళకి వెళతారు. సంపత్ రోజూ అబ్బూని ఆఫీస్ కి తీసుకురావడం, సాయంత్రం దింపడం చేస్తాడు. నన్ను కూడా సంపత్ వాళ్ళింటికే భోజనానికి తీసుకువెళ్ళారు. భోంచేసాక ఓ కోక్ టిన్ ఇస్తే అలవాటు లేదన్నా. పర్లేదు తాగమంటే నా హాండ్ బాగ్ లో వేసుకున్నా. మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాం. సాయంత్రం అబ్బు రూమ్ కి వచ్చాం. వంట నేను చేస్తానని చేసాను.

పాపం ఒక్కడే ఉండే అలవాటు కదా... ఎంప్లాయర్ మాట కాదనలేక నేను నాలుగు రోజులు ఉండటానికి ఒప్పుకున్నాడు కాస్త ఇబ్బందిగా. నేను నా కంఫర్టర్ వేసుకుని కింద పడుకున్నా. మొటల్ లో బెడ్, టీ వి, వంట పాత్రలు కొన్ని ఇస్తారు. చిన్న డైనింగ్ టేబుల్ సెట్ కూడా ఇస్తారు కొన్ని చోట్ల.

మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్ళాక, ప్రాజెక్ట్ మానేజర్ క్రిష్ వస్తే, తనతో మాట్లాడటం, టెన్షన్ పడకుండా, ఫ్రీగా వర్క్ చేసుకో, విల్ సపోర్ట్ యు.. అని వర్క్ ఎలాట్ చేసారు. VC++ లో బిడ్ బార్ ని డిజైన్ చేసి పేజ్ లింక్ లు Vb లో చేసిన వాటికి ఇమ్మని చెప్పారు. మనం ఈ ప్రాజెక్ట్ కి వచ్చింది  VC++లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగానన్నమాట. మనకేం రాదని చెప్పలేము.

ఇక మన కష్టాలు మెుదలు. మనకా  VC++ చదివిన నాలెడ్జే కాని ప్రాక్టికల్ గా లేదాయే. సరే ఆరోజు అసలు ఏం చేయాలో, ఏమిటో అన్ని చూసుకుంటూ నోట్సు రాసుకున్నా. సాయంత్రం రూమ్ కి వచ్చాక పుస్తకాలు ముందేసుకుని రేపు చేయాల్సిన వాటి గురించి చూసుకుంటున్నా. అబ్బు అడిగాడు...వెంకట్ మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పాడంటే, నేను కాదని నా పరిస్థితి ఇదని చెప్పా.  మానేజర్ క్రిష్ చాలా మంచోడు, కంగారు పడకుండా మెల్లగా చేసుకోండని అబ్బు చెప్పాడు. అలాగే ఆ వీక్ గడిచింది.

వీకెండ్ కొత్తగా మా ఆఫీస్ లో చేరే కాలే శ్రీనివాసరావు దంపతులు అబ్బు రూమ్ కి వచ్చారు. వాళ్ళు ఇల్లు చూసుకుంటున్నారు. నన్ను వాళ్ళతో షేర్ చేసుకోమన్నారు. నాకేమెా అంతా కొత్త కదా.. పోన్లే కాస్త ఖర్చు తగ్గుతుంది, కార్ తో కూడా పని ఉండదు, కాలే శ్రీనివాసరావు గారు తీసుకువెళతారులే, లేదంటే అదే అపార్ట్మెంట్స్ లో మరో శ్రీను, శ్యామ్ కూడా ఉంటున్నారు. ట్రాన్స్పోర్ట్ కి ప్రోబ్లం ఉండదులే అనుకున్నా.

అబ్బు హెల్ప్ తో బాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, డబ్బులు దానిలో వేశాను. బాంక్ మనీ మెషిన్ లో డబ్బులు, చెక్ ఎలా డిపాజిట్ చేయాలో కూడా అబ్బునే చూపించాడు. వీకెండ్ అబ్బు రూమ్ లో కాలిఫోర్నియాలోని వాళ్ళ అన్నయ్య  దగ్గర నుండి తెచ్చుకున్న తెలుగు సినిమాలు చూడటంతో గడిచిపోయింది. నేను నా పెళ్ళైన తర్వాత చూడని సినిమాలన్నీ అమెరికా వెళ్ళాక చూసేసానన్నమాట.  ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

 

ముందు వారాల లింకులు  

 ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే... 9

 

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల  ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కుకిటులు... 8

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి? - 7

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...


   carson-city-andhra-women-IT-job