ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే...

Header Banner

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే...

  Sat May 23, 2020 13:31        U S A, Rachanalu (రచనలు), మనసు హృదయం

మెుత్తానికి కాలే దంపతులతో కలిసి కొత్త ఇంటికి వచ్చాను. మా ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. మాది డబల్ బెడ్ రూమ్. ఓ రూమ్ నాది. ఇక మెుదలయ్యాయి పాట్లు. నాకేమో పొద్దున్నే లేచే అలవాటు. ఆఫీస్ కి రడీ అయ్యి కాఫీ నేను పెట్టుకుంటూ వారిద్దరికి కూడా పెట్టిచ్చేదాన్ని.

ఎందుకో తెలియదు కాని కాలే శ్రీనివాసరావు గారికి నేను ఏం చేసినా నచ్చేది కాదు. పేర్లు పెడుతూనే ఉండేవారు. అలా మెుత్తానికి నాకు కాఫీ పెట్టడం రాదని తేల్చేసారు. ఆవిడ పేరు నాకు గుర్తు లేదు కాని ఏ మాటకామటే... ఆవిడ ఏం మాట్లాడేది కాదు. నేను పట్టించుకోనట్టే ఉండటానికి ట్రై చేయడం మెుదలెట్టా. మధ్యాహ్నం లంచ్ ఆవిడే ప్రిపేర్ చేసేవారు. సాయంత్రం వచ్చాక మెుత్తం అంట్లు నా పనన్న మాట. నైట్ కూడా అన్ని  క్లీన్ చేసేసి పడుకునేదాన్ని.             

నాకేమో VC++ థియరీ నాలెడ్జ్ మాత్రమే ఉందాయే. కైలాష్ పుణ్యమా అని తన ఫ్రెండ్ కాలే VC++ లో వర్క్ చేయడం, తన ఫోన్ నెంబరిచ్చి హెల్ప్ చేస్తాడని చెప్పాడు. కాలే చాలా మంచబ్బాయ్. రోజూ నా డౌట్స్ అన్నీ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక ఫోన్ చేసి అడగడం, తను క్లియర్ చేయడం ఇలా ఓ 15, 20 రోజులు బాగా కష్టపడ్డాను. తర్వాత బాగా ఈజీ అయిపోయింది వర్క్. ఆ టైమ్ లోనే నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ యశోద నాకు VC++ పుస్తకం ఆన్ లైన్ లో కొని పంపించింది.  నాకు అప్పటికి ఇంకా ఫోన్ లేదు. ఈ దంపతులు ఇంటికి లాండ్ లైన్ పెట్టించారు.

అప్పట్లో ఇంటర్నెట్ కూడా లాండ్ లైన్ తోనే కనక్ట్ చేసుకునే వాళ్ళం. వాళ్ళకు డెస్క్ టాప్ కంప్యూటర్ కూడా ఉంది. లాండ్ లైన్ ఫోన్ ఈ స్టేట్ వరకే ఫ్రీ కాల్స్. వేరే స్టేట్స్ కి చేయాలంటే కాలింగ్ కార్డ్స్ వాడుకోవాలి. నాకు నరసరాజు అంకుల్ ఓ 1 800 నంబర్ ఇచ్చారు. ఇండియాకి చేసుకోవడానికి. నేనది ఈ ప్రాజెక్ట్ లో డౌట్స్ కోసం కూడా వాడేసాను తెలియక. పాపం అంకుల్ కి ఎక్కువ బిల్ వచ్చి, ఫోన్ చేసి అడిగితే ఇలా వాడానని చెప్పాను. ఇక్కడ ఫోన్ చేయడానికి వేరే కాలింగ్ కార్డ్స్ ఉంటాయని చెప్పారు.

అప్పుడు ఇంకో శ్రీనివాస్ సంధ్య వాళ్ళతో  Cost Co కి గ్రోసరీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ కాలింగ్ కార్డ్స్ కూడా కొనుక్కున్నా. నేను ఇంటికి చేయడానికి కూడా 10 డాలర్ల కాలింగ్ కార్డ్ కొంటే 12 నిమిషాలు వచ్చేది మెుదట్లో. తర్వాత తర్వాత 24 మినిట్స్ వచ్చేవి. నరసరాజు అంకుల్, గోపాలరావు అన్నయ్య ఫోన్ చేస్తూనే ఉండేవారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మా పెద్దమ్మ చెల్లెలి కొడుకు ప్రసాద్ అన్నయ్య కూడా నేను అమెరికా వచ్చినప్పటి నుండి మాట్లాడుతునే ఉండేవాడు. అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి చూసివెళ్ళాడు కూడా. 

ఇక మా రూమేట్స్ నాతో బాగా ఆడుకునే వారు. వాళ్ళ ప్రెషర్కుక్కర్ లో నేను ఏదో పెడితే సేఫ్టీ వాల్వ్ పోయింది. దానికి అది నన్నే కొనిమ్మన్నారు. నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ శోభ కాలిఫోర్నియాలో ఉండేది. తనకి ఫోన్ చేసినప్పుడు ఈ సేఫ్టీ వాల్వ్ గురించి ఎక్కడ దొరుకుతుందని అడిగితే, నా దగ్గర ఉంది, నేను పంపిస్తాను అని నా అడ్రస్ తీసుకుని సేఫ్టీ వాల్వ్ పంపించింది. ఇలా రోజూ ఏదోక దానికి ఆయన  నన్ను సాధించడం, ఆవిడేమో ఏమీ మాట్లాడకపోవడం, అలా నడుస్తోంది.

నాకేమో ఎంత అడ్జస్ట్ అవుదామన్నా వీలుకాకుండా ఉంది. ఆవిడకు ఆవిడ మీద చాలా నమ్మకం తను బాగా తెలివైనదాన్నని. నేను ఎందుకు పనికిరాని దానినని. జాబ్ కూడా ఆవిడకు రావాల్సింది, ఏదో నా లక్ బావుండి నాకు వచ్చిందని. ఆఫీసులో కూడా ఈయన అందరిని ఏదోకటి అనడంతో మా చుట్టుపక్కల వాళ్ళందరు కాస్త దూరంగానే ఉండేవారు. నాతో బావుండేవారు. అది కూడ వీళ్ళకి నామీద కోపం పెరగడానికో కారణమైయుండవచ్చు. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

ఓ వీకెండ్ సంధ్యా  శ్రీనివాస్ వాళ్ళు " లేక్ తాహు " చూడటానికి వెళుతూ నన్ను రమ్మన్నారు. వాళ్ళకు  వన్ ఇయర్ పాప. పేరు సహన. నాకు బాగా అలవాటైపోయింది. తన స్పెషాలిటి ఏంటంటే అమ్మాయి దగ్గరకస్సలు వెళ్ళదట. కాని నా దగ్గరకు బాగా వచ్చేది. నాకు మా మౌర్యని వదిలి వచ్చానేమో, తనతో ఎక్కువ ఆడుకునేదాన్ని. "లేక్ తాహు "  వెళుతున్నానని నరసరాజు అంకుల్ కి చెప్తే బావుంటుంది, ట్రెక్కింగ్ అది ఉంటుంది చూడు అని చెప్పారు.

శ్రీను వాళ్ళ కార్ లో వాళ్ళు ముగ్గురు, నేను బయలుదేరాం. మాటల్లో శ్రీను మంజూ నువ్వు వచ్చి 6 నెలలు కాకుండానే ఇవన్నీ చూసేస్తున్నావు, నేను వచ్చిన 4, 5 ఏళ్ళకు కాని చూసే అవకాశం రాలేదని నవ్వాడు. బాగా స్నో ఉన్న చోట ఫోటోలు దిగుతూ, కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం బాగా జరిగింది. అలా లేక్ తాహు వెళ్ళే దారిలో కొండలు,లోయలు, టన్నెల్ కూడా ఆ లాంగ్ డ్రైవ్ లో చూసేసాను. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

 

ముందు వారాల లింకులు  

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో... 10

 ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే... 9

 

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల  ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కుకిటులు... 8

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి? - 7

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...


   andhra-adapaduchu-amerikaa-kaburlu