ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో...

Header Banner

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో...

  Sat May 30, 2020 14:47        Rachanalu (రచనలు), U S A

మన తెలుగు పండుగలన్నీ కూడా అందరం కలిసి బాగా చేసుకునేవాళ్ళం. ఎక్కువగా శ్రీను సంధ్య వాళ్ళింట్లోనే అందరం కలిసేవాళ్ళం. ఓ రెండు నెలలు గడిచే సరికి నేను కాలే దంపతులతో కలిసి ఉండలేక వేరే మోటల్ చూసుకుంటుంటే సంపత్ మారిన ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ ఉన్న చోటే రూమ్ ఉందంటే అక్కడ చూసుకుని మారిపోదామని అనుకున్నా. ఆఫీస్ అయ్యాక శ్రీను, అబ్బు బయటకు వస్తామంటే నా లగేజ్ తీసుకుని వాళ్ళు రాకముందే బయటకు వచ్చి నిలుచున్నా. కాసేపటికి వాళ్ళు వచ్చి లగేజ్ కార్ లో సర్ది నా కొత్త రూమ్ కి తీసుకువెళ్ళారు.

నేను తీసుకున్న మోటల్ రూమ్ లో బెడ్, టివి, చిన్న టేబుల్, చైర్, కాసిని వంట సామాన్లు ఉండేవి. బట్టలకు వాషర్, డ్రయర్ వేరే చోట ఉండేవి. రోజు మధ్యాహ్నం లంచ్ సంపత్ కి, అబ్బుకి మా ఇంట్లోనే. సాయంత్రం ఎవరి తిండి వారిది. నన్ను, అబ్బుని సంపత్ రోజూ ఆఫీస్ కి తీసుకువెళ్ళడం, తీసుకురావడం, ఎవరి పనుల్లో వాళ్ళు అలా జరిగిపోతోంది.

ఓ రోజు మా మేనేజర్ క్రిష్ జాబ్ మానేస్తున్నానని చెప్పాడు. మా కంపెనీ ఓనర్ పేరు కూడా బాబ్. మా ప్రాజెక్టు పేరు చెప్పలేదు కదా లోయస్ట్ బిడ్స్ డాట్ కాం. బిడ్ బార్ డిజైనింగ్, ASP పేజ్ లింక్స్ బిడ్ బార్ లో పెట్టడం నా పని. బిడ్ బార్ డిజైనింగ్ అంతా క్లయింట్ సైడ్ VC++ లోనే. సర్వర్ సైడ్ సాకెట్ ప్రోగ్రామింగ్ అంతా క్రిష్ ఫ్రెండ్ పేరు సరిగా గుర్తు లేదు మైక్ అనుకుంటా తను చేసేవాడు. మిగతావాళ్ళంతా ASP, Administration, testing చేసేవారు. ప్రాజెక్ట్ లైవ్ అంతా చూసుకునేవారు. ఇష్యూష్ వస్తే ఎవరిది వారు సాల్వ్ చేసేవారు. అలాంటిది సడన్ గా క్రిష్ కి, బాబ్ కి క్లాష్ వచ్చి క్రిష్, క్రిష్ ఫ్రెండ్ జాబ్ కి రిజైన్ చేసేసారు. బాబ్ మీటింగ్ పెట్టి మా అందరికి జాబ్ పర్మెనెంట్ చేసి తన కంపెనీ నుండి వర్క్ పర్మిట్ స్పాన్సర్ చేస్తానని చెప్పారు. 

మేం ఆలోచించుకుని చెప్తామని చెప్పాము.సాకెట్ ప్రోగ్రామింగ్ గురించి నన్ను చూడమని నాకు మైక్ సిస్టమ్, కాబిన్ ఇచ్చారు. కంపెనీ ఆఫర్ పర్మెనెంట్ తీసుకుంటే మనకున్న H1 కాన్సిల్ అవుతుంది. వీళ్ళు పర్మెనెంట్ అని కూడ తర్వాత జాబ్ తీసేస్తే మనకు స్టేటస్ ఉండదు. కొంత టైమ్ ఉంటుంది. ఆ టైమ్ లోపల H1 ఫైల్ చేయించుకోవాలి లేదంటే ఇల్లీగల్ అయిపోతాము. 

ఇలా పర్మెనెంట్ ఆఫర్ తీసుకుంటే మధ్యలో వేరే ఎవరు ఉండరు. డైరెక్ట్ క్లయింట్ తో మనకు లావాదేవీలుంటాయి. మధ్యలో వెండర్స్ ఉండరన్న మాట. నాలుగు రోజులయ్యాక అందరం సరేనని మా పని మేం చేసుకుంటున్నాం. ఈ మధ్యలో శ్యామ్ ఫ్రెండ్ కూడా మా ప్రాజెక్ట్ లోనికే వచ్చాడు వెంకట్ ఎంప్లాయర్ ద్వారా. నాకు కాస్త తమిళ్ కూడా అర్థమవుతుంది. శ్యామ్ అతన్ని తీసుకురావడానికి ఇక్కడ ఉన్నవారిలో ఎవరినైనా తీసేయించాలని ట్రై చేయడం, నాకు తమిళ్ తెలియదని తను తమిళ్ లో మాట్లాడటం, నేను వీళ్ళకు చెప్పడం జరిగింది.

అసలే ప్రాజెక్ట్ ఉంటుందో, పోతుందో అన్న టెన్షన్ మాది. మధ్యలో ఈ గోల. అంటే అన్నానంటారు కానండి మన ఆంధ్రా వాళ్ళు మనవాళ్ళకి అసలు హెల్ప్ చేయరు. మిగతావాళ్ళు అలా కాదు. ఎంతయినా ఒక్క ఆంధ్రా వాళ్ళకు లేనిది మిగతా వారికందరికి ఉన్న యూనిటితో శ్యామ్ తన ఫ్రెండ్ ని కూడా మా ప్రాజెక్ట్ లోనికి తెచ్చేసాడు సాకెట్ ప్రోగ్రామింగ్ మీద. 

3 నెలలు నాకు సాలరి పే చేసిన HNC కంపెని తర్వాత పే చేయడం మానేసింది. అడుగుతుంటే క్లయింట్ దగ్గర నుండి రాలేదని చెప్పడం మెుదలుబెట్టారు. మనకి క్లయింట్ తో సంబంధం లేదు, క్లయింట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మన ఎంప్లాయర్ మనకి పే చేయాలి. సరే ఇస్తారులే అని మరో 3 నెలలు ఊరుకున్నాను. ఈ క్లయింట్ పని చేయించుకుంటున్నాడు కాని మా పేపర్స్ అడగడం  లేదు ఫైలింగ్ కి.

ఎనిమిది నెలలు చూసాక ఇక మానేద్దామని నిర్ణయించుకుని, ఎంప్లాయర్ బాబ్ ని అడిగితే సమాధానం చెప్పడం లేదు. వినయ్ గారికి ఫోన్ చేస్తే అడగండి అంటారే కాని ఉపయోగం లేదు. ఓ నెల రోజులు అలానే ఉన్నా. అబ్బు వాళ్ళ అన్నయ్య దగ్గరకి అప్పుడే వెళ్ళనంటే, సరేనని నాతో ఉండమన్నా. షణ్ముఖ్ కూడ ఫోన్ చేసేవాడు అప్పుడప్పుడు. ఈ విషయం చెప్తే ఇక్కడికి వచ్చేయండి, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు అని చెప్పాడు. అప్పటికే తర్వాత నెలకు కూడా మనీ పే చేసేసా. అబ్బు ఉంటానంటే తనకి అప్పజెప్పి, బస్ లో రెండునర్ర రోజులు నెవెడా స్టేట్  కార్సన్ సిటీ నుండి చికాగోలోని అరోరా HNC కంపెనీ గెస్ట్ హౌస్ కి వచ్చాను.

అక్కడ విజయ్ అనే అతను ఉన్నాడు. తను ఇండియాకి వెళిపోతున్నాడు. ఓ వారం, పది రోజులున్నాక బాబ్ ఇండియా టికెట్ ఇస్తాను, ఇండియాకి వెళ్ళమన్నాడు. నాకు H1 కూడా వీళ్ళ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయలేదు. నేను పక్కన షాప్ కి వెళితే అక్కడ కనబడిన కాప్(పోలీస్ ని కాప్ అంటారు) కి జరిగిన విషయం అంతా చెప్పాను. కాప్ బాబ్ నంబర్ అడిగితే ఇచ్చాను. బాబ్ కి కాల్ చేసి తిట్టాడనుకుంటా. ఆ సాయంత్రం బాబ్ గెస్ట్ హౌస్ కి వచ్చి వాడిష్టం వచ్చినట్టు తిట్టి, గెస్ట్ హౌస్ నుండి వెళిపొమ్మన్నాడు. ఆ విజయ్ బాగా భయపడిపోయాడు. రావాల్సిన డబ్బులు ఇమ్మన్నాను నేను. ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. షణ్ముఖ్ కి కాల్ చేసి చెప్పాను జరిగింది.

వాళ్ళ రూమ్ లో పూజారి గారు, తనతో పాటు ఉండమని చెప్పాడు. నేను కార్సన్ సిటిలో ఉన్నప్పుడు మా స్కూల్ అల్యూమిని వెబ్ సైట్ లో నేను యాడ్ అయ్యాను. గోవర్ధన్ బొబ్బా అని అవనిగడ్డ అతను, చిన్నప్పుడు మా స్కూల్ లోనే తను కూడా, కాకపోతే నా పేరు తెలుసు కాని నన్ను చూడలేదెప్పుడూ. తను ఓ రోజు కాల్ చేసాడు. తన వివరాలు చెప్పి అప్పటి నుండి అప్పుడప్పుడూ మాట్లాడేవాడు. ఇలా నా ప్రాజెక్ట్ అయిపోయిందని, కంపెని వాడు బెదిరించాడని చెప్పాను. గోవర్ధన్ ఇండియానా లో ఎమ్ ఎస్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరకు రమ్మని చెప్పాడు.

మరుసటి రోజు విజయ్ ఇండియా వెళిపోయాడు. షణ్ముఖ్ వాళ్ళ రూమ్ లో ఉన్నాను ఆ రోజు. రెండు మూడు గాస్ స్టేషన్స్ కి జాబ్ అడగడానికి కూడ తీసుకువెళ్ళాడు. మన పరిస్థితి ఏంటా అని దిగులుతో ఆ రాత్రంతా నిద్ర పోలేదు. మరుసటి రోజు గోవర్ధన్ ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ తో వచ్చానని, నన్ను వాళ్ళతో రమ్మని చెప్పాడు. అడ్రస్ చెప్తే వచ్చి ఇండియానా నన్ను కూడా తీసుకువెళ్ళారు. ఓ సూట్కేస్ ఇక్కడే వదిలేసాను. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

 

ముందు వారాల లింకులు  

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే... 11

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో... 10

 ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే... 9

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల  ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కుకిటులు... 8

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి? - 7

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...


   Indiana-america-andhra-adapaduchu